నోటికందిన కూడు నేలపాలు కావటం అంటే ఇదేనేమో.. మనం చెప్పుకోబోయే బాలుడికి జరిగిన ఘటన అచ్చం ఈ సామెతను తలపిస్తోంది. అనుకోకుండా చేతికందిన సొమ్మును తానుచేసిన చిన్న పొరపాటుతో పోలీసులకు అప్పగించాల్సి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలోని అరుద్‌ గ్రామానికి చెందిన ఓ బాలుడు ఉదయాన్నే చేపల పట్టడానికి వెళ్లాడు. చెరువు వద్దకు వెళ్లి వల విసిరాడు. చేపలు చిక్కినట్లు అనిపించడంతో వలను నెమ్మదిగా పైకిలాగాడు. వలలో కరెన్సీ నోట్ల కట్టలను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. గుట్టుచప్పుడు కాకుండా బైటకు లాగి చూడగా.. రూ. 500, రూ. 2వేల నోట్ల కట్టలు ఉన్నాయి.

Also Read : వెనక్కి తగ్గని జగన్‌.. కృష్ణాబోర్డుకు, కేంద్రానికి తెలంగాణ ఫిర్యాదు

దీంతో నీటిలో తడిసిన వీటిని జాగ్రత్తగా తీసి అక్కడే ఆరబెట్టాడు. కొద్దిసేపటికి తడిఆరిపోవటంతో గాలికి నోట్లు ఎగిరిపోయాయి. దీంతో ఉన్న నోట్లను తీసుకొని ఇంటికెళ్లిపోయాడు. గాలికెగిరిపోయిన నోట్లు గ్రామస్తులకు కనిపించడంతో వారు ఏరుకోవటం మొదలు పెట్టారు. ఈ విషయం కాస్తా గ్రామానికి చెందిన ఓ యువకుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తాను ఉదయం ఇటుగా వెళ్లే సమయంలో ఓ వ్యక్తి చెరువులో మూటపడేసినట్లు కనిపించిందని, కానీ ఏపడేశాడో తాను గమనించలేదని పోలీసులకు వివరించాడు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఈ నోట్లు ఎలా వచ్చాయో ఆరాతీయడం మొదలుపెట్టారు. దీంతో చివరికి బాలుడికి నోట్లు దొరికాయని గుర్తించి దొరికిన నోట్లన్నీ స్టేషన్‌లో అప్పగించాలని బాలుడితో పాటు గ్రామస్తులకు ఆర్డర్‌ వేశారు. చేసేది ఏమీలేక దొరికిన నోట్లను పోలీసులకు ఇచ్చేశారు.

Also Read :పసికందుతో 150 కి.మీ నడిచిన బాలింత..! చివరికి..

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *