‘బుల్‌బుల్‌’ తుపానుపై ప్రధాని మోదీ ఆరా..

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘బుల్‌బుల్‌’ తుపాను ప్రభావం పశ్చిమ బెంగాల్‌పై తీవ్రంగా చూపుతుంది. దీంతో పశ్చిమబెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి బెంగాల్-బంగ్లాదేశ్ మధ్య ‘బుల్‌బుల్’ తుఫాన్ తీరం దాటింది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్, పారాదీప్, బంగ్లాదేశ్‌ తీరాల్లో గంటకు 120 నుంచి 140 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో ఫోన్‌లో మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్రం నుంచి అన్ని రకాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.