'బుల్‌బుల్' తుపానుపై ప్రధాని మోదీ ఆరా..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Nov 2019 1:41 PM ISTబంగాళాఖాతంలో ఏర్పడిన 'బుల్‌బుల్' తుపాను ప్రభావం పశ్చిమ బెంగాల్‌పై తీవ్రంగా చూపుతుంది. దీంతో పశ్చిమబెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి బెంగాల్-బంగ్లాదేశ్ మధ్య 'బుల్‌బుల్' తుఫాన్ తీరం దాటింది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్, పారాదీప్, బంగ్లాదేశ్ తీరాల్లో గంటకు 120 నుంచి 140 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో ఫోన్‌లో మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్రం నుంచి అన్ని రకాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
Next Story