'పేదలకు రూ.34 లక్షల కోట్లు అందించాం'.. బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ
లోక్‌సభ ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టారు. గురువారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో కేంద్ర పద్దను ప్రవేశపెట్టారు.
By అంజి Published on 1 Feb 2024 11:30 AM IST'పేదలకు రూ.34 లక్షల కోట్లు అందించాం'.. బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ
లోక్‌సభ ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టారు. గురువారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో కేంద్ర పద్దను ప్రవేశపెట్టారు. అంతకుముందు కేంద్ర కేబినెట్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ నినాదం భారత్ ఆర్థిక మూలాలను పటిష్ఠం చేసిందని కేంద్రమంత్రి నిర్మల అన్నారు. పదేళ్లలో మోదీ నాయకత్వంలో అమలు చేసిన సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదం చేశాయని అన్నారు. బాధ్యతాయుతంగా తీసుకున్న నిర్ణాలు ఆర్థిక వ్యవస్థలో కొత్త ఉత్సాహాన్ని నింపాయని నిర్మలాసీతారామన్ అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌గా అవతరించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
అన్నదాతలకు కనీస మద్దతు ధరను దశల వారీగా పెంచామన్నారు. నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామికవేత్తలు పుట్టొక్చారని, ఆత్మనిర్భర భారత్ నిర్మాణంలో ప్రతి వ్యక్తి భాగస్వాములయ్యారని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ ఏర్పడిందన్నారు. ఇంటింటికీ విద్యుత్, ఉపాధి, తాగునీరు సమ్మిళిత అభివృద్ధి నానాదాలని కేంద్రమంత్రి అన్నారు. పడిపోతున్న వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం కొత్త ఊపిరి ఊదిందన్నారు. మద్దతు ధరలు, పెట్టుబడి రాయితీలతో రైతులకు ప్రయోజనాలు కల్పించామన్నారు. పేదలు, మహిళలు, యువత, అన్నదాతలను తమ ప్రభుత్వం శక్తిమంతం చేసిందన్నారు.
కుల, మత ఆర్థిక బేధాలు లేకుండా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. 2047 నాటికి అసమానత, పేదరికం కనబడకుండా చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. పేదలకు జన్‌ధన్ ఖాతాల ద్వారా రూ.34 లక్షల కోట్ల రూపాయలను అందించామని కేంద్రమంత్రి తెలపిఆరు. 78 లక్షల మంది వీధి వ్యాపారులకు ఆర్థికసాయం అందించామన్నారు. రూ.2.20 లక్షల కోట్ల పూచీకత్తు లేని రుణాలు అందించామన్నారు. గత పదేళ్లలో 7 ఐఐటీలు, 16 ట్రిపల్ ఐటీలు, 7 ఐఐఎంలు, 15 ఎయిమ్స్‌లు, 390 యూనివర్సిటీలు ఏర్పాటు చేశామన్నారు. 10 ఏళ్లలో ఉన్నత విద్య చదివే అమ్మాయిల సంఖ్య 28 శాతం పెరిగిందన్నారు.