Budget 2024: ఆర్ధిక మంత్రి కీలక ప్రకటనలు చేయబోతున్నారా?
ఫిబ్రవరి దగ్గరపడుతుండడంతో ఆర్థిక పరిస్థితిపై సమీక్ష, బడ్జెట్‌పై ఫోకస్ పెరిగింది. మరికొద్ది నెలల్లో దేశంలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.
By అంజి
Budget 2024: ఆర్ధిక మంత్రి కీలక ప్రకటనలు చేయబోతున్నారా?
ఫిబ్రవరి దగ్గరపడుతుండడంతో ఆర్థిక పరిస్థితిపై సమీక్ష, బడ్జెట్‌పై ఫోకస్ పెరిగింది. మరికొద్ది నెలల్లో దేశంలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఈసారి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ మధ్యంతర బడ్జెట్‌లో పలు రంగాలకు కొంత మేర ప్రయోజనం కలిగించే ప్రకటనలు ఉండే అవకాశం సమాచారం. ఎన్పీఎస్ స్కీంకు సంబంధించిన కాంట్రిబ్యూషన్స్, విత్ డ్రావల్స్ పై పన్ను రాయితీలను పొడిగించి, ఈ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చే విధంగా రానున్న మధ్యంతర బడ్జెట్‌లో కేంద్రం ప్రభుత్వం ప్రకటనలు చేసే అవకాశం ఉందని బడ్జెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ ఈ ప్రకటన వస్తే.. 75 ఏళ్ల వయస్సు పైబడిన వారికి ప్రయోజనకరంగా ఉండనుంది.
అలాగే పీఎఫ్ఆర్డీఏ, ఎంప్లోయర్స్ కాంట్రిబ్యూషన్ కి సంబంధించిన పన్ను విషయంలో ఈపీఎఫ్ఓతో సమానత్వం కోరిందని, దీనికి సంబంధించి ఈ బడ్జెట్‌లో కొన్ని ప్రకటనలు చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అగ్రికల్చర్ లోన్ టార్గెట్‌ను రూ. 22 నుంచి రూ. 25 లక్షల కోట్లకు పెంచడంతో పాటు, అర్హులైన రైతులకు సంస్థాగత రుణాలు అందేలా కేంద్రం ప్రభుత్వం రానున్న మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.
అలాగే తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి, ఉపాధి అవకాశాలను పెంచడానికి రానున్న బడ్జెట్‌లో వస్త్రాలు, ఆభరణాలు, హస్తకళలు వంటి రంగాలను పీఎల్ఐ స్కీంలో చేర్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దేశంలోని పేద రైతుల బ్యాంకు ఖాతాలలోకి నిధులను బదిలీ చేయడం ద్వారా వారిని ఆర్ధికంగా ఆదుకుంటున్న ప్రభుత్వం, ధనిక రైతులపై ఆదాయ పన్నును విధించి పన్నుల విషయంలో పారదర్శకతను తీసుకురావాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం.