మత్తు మందిచ్చి బీటెక్ విద్యార్థినిపై అఘాయిత్యం
By తోట వంశీ కుమార్ Published on 28 Jun 2020 10:46 AM ISTస్నేహితులే కదా అని నమ్మింది. కలిసి చదువుకుందాం అంటే ఇంటికి వెళ్లింది. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చారు. అనంతరం ఆ యువతి అశ్లీల వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
గుంటూరుకు చెందిన ఓ విద్యార్థినికి మూడు సంవత్సరాల క్రితం అదే ప్రాంతానికి చెందిన వరుణ్, కౌశిక్‌తో పరిచయం అయ్యింది. చదువుకుందాం అంటూ ఓ అపార్టుమెంట్‌కు తీసుకెళ్లి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి అత్యాచారం చేశారు. దానిని వీడియో తీసి విద్యార్థిని బెదిరిస్తున్నారు. దీంతో బాధితురాలు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన దిశ పోలీసు బృందం ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు కౌశిక్, వరుణ్‌లను అరెస్టు చేసింది.
2017 నుంచి ఇద్దరు విద్యార్థులు యువతి నగ్న చిత్రాలను నెట్ లో పెట్టి వేధిస్తున్నారని గుంటూరు అర్భన్ ఎస్పీ తెలిపారు. మొదట యువతి ఫోటోలను తాత్కాలికంగా డిలీట్ చేశారని చెప్పారు. ఆ యువతి మరొకరితో సన్నిహితంగా ఉందని చెప్పి ఆ వీడియోను మరో యువకుడికి చూపించారన్నారు. ఆ తరువాత నిందితులు కౌశిక్, వరుణ్ బాధితురాలి వీడియోలను పోర్న్ సైట్‌లో పెట్టారని తెలిపారు. ఈ ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పేర్కొన్నారు.