అన్నదమ్ములు మూడో అంతస్థు నుండి దూకాల్సి వచ్చింది.. కింద ఉన్న వాళ్లు గ్రేట్ బాసూ..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 July 2020 10:57 AM GMT
అన్నదమ్ములు మూడో అంతస్థు నుండి దూకాల్సి వచ్చింది.. కింద ఉన్న వాళ్లు గ్రేట్ బాసూ..!

మూడో అంతస్థు పై నుండి ఇద్దరు అన్నదమ్ములు దూకాల్సి వచ్చింది. అలా దూకిన వాళ్ళను కింద ఉన్న వాళ్లు పట్టుకోవడం విశేషం. ఈ ఘటన ఫ్రాన్స్ లో చోటుచేసుకోగా.. వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

గ్రెనోబుల్ నగరంలో మంగళవారం నాడు ఈ ఘటన చోటుచేసుకుంది. మూడు, 10 సంవత్సరాల వయసు ఉన్న అన్నదమ్ములు లోపలే ఉండిపోయారు. వారి దగ్గర ఎటువంటి తాళాలు లేకపోవడంతో 40 అడుగుల పై నుండి దూకేయాల్సి వచ్చింది. చుట్టూ దట్టమైన పొగ.. కొద్దిసేపు ఉండి ఉంటే ఊపిరి ఆడక మరణించి ఉండే వాళ్లే.. కానీ సమయస్పూర్థితో కూడుకున్న సాహసం వారి ప్రాణాలను కాపాడింది.

ఈ పిల్లల తల్లిదండ్రులు వాళ్ళను లోపలే ఉంచి వెళ్లిపోయారు. ఇంతలో ఆ బిల్డింగ్ లో మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగ ఆ ఇంటిని కమ్మేసింది. ఆ పిల్లలు తమ ప్రాణాలను కాపాడుకోడానికి కిటికీ దగ్గరకు వచ్చారు. కింద ఉన్న వాళ్లు దూకేయమని చెప్పడంతో 10 సంవత్సరాల పిల్లాడు.. తన మూడేళ్ల తమ్ముడిని మొదట జారవిడిచాడు. కింద ఉన్న వ్యక్తులు అతడిని పట్టుకున్నారు. ఆ తర్వాత ఆ పిల్లాడు కూడా దూకేశాడు. అతడిని కూడా క్యాచ్ పట్టుకున్నారు కింద ఉన్న వాళ్లు. ఈ ఘటనలో ఆ పిల్లలకు ఎటువంటి గాయాలు అవ్వలేదు. కింద పిల్లలను క్యాచ్ పట్టుకున్న వ్యక్తికి చేయి విరిగింది. ఎదురుగా ఉన్న మరో అపార్ట్మెంట్ కు చెందిన వ్యక్తి ఈ ఘటనను వీడియో తీశాడు.

25 సంవత్సరాల విద్యార్థి అయిన అతౌమని వాలిద్.. పిల్లలను క్యాచ్ పట్టుకోవడంతో చేయి విరిగిపోయింది. ఎవరో అరుస్తూ ఉండడం గమనించానని.. వెంటనే అక్కడకు వచ్చానని తెలిపాడు వాలిద్. వాళ్ళు ఉంటున్న ఇంట్లో మంటలు చెలరేగడం, ఏదో పేలుతూ ఉండడం, దట్టమైన పొగతో నిండిపోవడంతో పిల్లలు ఏడుస్తూ కనిపించారని.. భయపడిపోయారని వాలిద్ తెలిపాడు.

గ్రెనోబుల్ మేయర్ ఎరిక్ పియోలే పిల్లలను కాపాడిన వ్యక్తులకు కృతజ్ఞతలు చెబుతూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. ఆ ఇంట్లో మంటలు ఎలా చెలరేగాయి అన్న విషయమై ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. క్యాచ్ పట్టుకున్న వ్యక్తులు గ్రేట్ బాసూ అంటూ కామెంట్లు పెడుతున్నారు.



Next Story