హిట్‌మ్యాన్ కంటే కోహ్లీనే అత్యుత్తమం
By తోట వంశీ కుమార్ Published on 3 Jun 2020 3:14 PM ISTభారత జట్టు భారాన్ని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లు మోస్తున్నారు. ఎన్నో మధురమైన విజయాలను జట్టుకు అందించారు. ఒక్కసారి కుదురుకుంటే హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఎంత విధ్వంసాన్ని సృష్టించగలడో తెలిసిందే. ఇక ఛేదనలో రారాజు విరాట్ కోహ్లీ అనడంలో సందేహాం లేదు. ఇద్దరిలో ఎవరు గొప్ప అన్న చర్చ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. ఇక ఇద్దరిలో ఎవరు గొప్ప అనేది చెప్పడం కష్టం. అయితే.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇద్దరిలో కోహ్లీనే అత్యుత్తమం అంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హాగ్.
'హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కన్నా విరాట్ కోహ్లీ బెటర్. ఎందుకంటే భారీ లక్ష్యాలను చేధించడంలో కోహ్లీ రికార్డు మెరుగ్గా ఉంది. ఎలాంటి ఒత్తిడి గురికాడన్నారు. ఇక ఇద్దరు విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. రోహిత్ ఓపెనర్‌గా బరిలోకి దిగుతుండగా.. మిడిల్ ఆర్డర్‌లో కోహ్లీ ఆడుతున్నాడు. పవర్ ప్లే అత్యధిక పరుగులు రాబట్టాల్సిన బాధ్యత రోహిత్‌ది. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడుతూ.. చివరి వరకు బరిలో నిలిచి జట్టుకు మంచి స్కోర్ అందించడం విరాట్ బాధ్యత. అందువల్ల ఇద్దరిని పోల్చడం సరికాదు' అని ఈ ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు అన్నాడు
ఇక రోహిత్ వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు బాదగా.. విరాట్ కోహ్లీ 43 శతకాలతో దూసుకుపోతున్నాడు. వీరిద్దరిలో ఎవరి గొప్ప వారిదే. అయితే.. విరాట్ ను మెచ్చుకున్న బ్రాడ్ హాగ్.. తన ఆల్‌టైమ్ అత్యుత్తమ టెస్టు జట్టులో విరాట్‌కి ప్లేస్ ఇవ్వలేదు. అందుకు హాగ్ వివరణ ఇచ్చాడు. 'కోహ్లీని ఎందుకు తీసుకోలేదని అందరూ ప్రశ్నిస్తారని తెలుసు. నేను ప్రస్తుతం ఆటగాడి ఫామ్ ఆధారంగానే జట్టును ఎంపిక చేశా. కోహ్లీ గత 15 టెస్టు ఇన్నింగ్స్‌లో కేవలం సార్లు మాత్రమే 31 పరుగులు చేశాడు. రోహిత్ 90 పైగా సగటు కలిగి ఉన్నాడు. అందుకనే రోహిత్‌ను ఎంపిక చేశా. మయాంక్ అగర్వాల్ కవర్ డ్రైవ్స్ అంటే చాలా ఇష్టం అని'బ్రాడ్ హాగ్ అన్నాడు. భారత్ నుంచి నలుగురు ప్లేయర్లకు టెస్టు జట్టులో చోటు కల్పించాడు.
బ్రాడ్ హాగ్ ప్రపంచ టెస్ట్ ఎలెవన్..
అజింక్యా రహానే, రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, స్టీవ్ స్మిత్, బాబర్ అజామ్, క్వింటన్ డికాక్, లబుషేన్, ప్యాట్ కమిన్స్,నాథన్ లయన్,మహ్మద్ షమీ, నీల్ వాగ్నర్.