ధోని రహస్యం బయటపెట్టిన రైనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Jun 2020 7:12 AM GMT
ధోని రహస్యం బయటపెట్టిన రైనా

ఐపీఏల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇందుకు సంకేతం చెన్నై జట్టుకు ఐపీఏల్ లో ఉన్న రికార్డులు. ఎక్కువ సార్లు ఫైనల్ చేరిన జట్టుగా, ఎక్కువ సార్లు ట్రోఫీ గెలిచిన రెండో జట్టుగా రికార్డు ఉంది. ఒకప్పుడు భారత జట్టుకు నాయకత్వం వహించి 2007 టి20 ప్రపంచ కప్,2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలు అందించిన మహేంద్ర సింగ్ ధోని ఐపీఏల్ మొదటి సీజన్ నుంచి గత ఏడాది వరకు చెన్నై జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు.

ఈ ఏడాది కూడా ధోనినే చెన్నై జట్టుకు సారథ్యం వహిస్తాడనడంలో సందేహం లేదు. ఈ ఏడాది ఐపీఎల్ కోసం చెన్నై జట్టుతో చేరి శిక్షణ మొదలు పెట్టిన ధోని గురించి తన సహచర ఆటగాడు సురేష్ రైనా కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు.

ఈ ఏడాది ధోని భాయ్ శిక్షణ ముందు కంటే విభిన్నంగా ఉంది. జిమ్ లో ఉదయం సాధన చేసి మరల సాయంత్రం వేళ బ్యాటింగ్ ప్రాక్టీస్ 2 నుంచి 4 గంటల సేపు చేస్తాడు."నాకన్నా.. రాయుడు,మురళి విజయ్ కంటే ఎక్కువ సేపు ధోని ప్రాక్టీస్ చేసాడు అని తెలిపాడు. ప్రాక్టీస్ లో భాగంగా ఎపుడైనా అలసిపోయినట్టు అనిపిస్తే ఇంకొద్ది సేపు ప్రాక్టీస్ కు సమయం కేటాయించాలని.. అపుడే మన శరీరం 4 గంటల సేపు మైదానంలో చురుగ్గా ఉంటుందని రైనా అభిప్రాయపడ్డాడు. ధోని తో జాతీయ జట్టుకు మరియు ఐపీఎల్ జట్టుకు ఆడిన అనుభవం ఈ ఏడాది కూడా ఉపయోగపడుతుందని, త్వరలోనే ఐపీఎల్ మొదలు అవ్వాలని, అభిమానులతో పాటు తను కూడా ధోని ఆట కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు రైనా స్టార్ స్పోర్ట్స్ షో కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపాడు.

ఇకపోతే ధోని తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ గత ఏడాది ప్రపంచ కప్ లో ఆడాడు. అప్పటి నుండి జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ మధ్యనే ధోని రిటైర్మెంట్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరిగింది. #dhoniretires అనే హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్లో పలువులు ట్వీట్లు చేసారు.ఇక ఆస్ట్రేలియాలో ఆ ఏడాది ఆక్టోబర్లో జరగాల్సిన పురుషుల టి20 ప్రపంచ కప్ దాదాపుగా వాయిదా పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ - అక్టోబర్ మధ్య ఐపీఎల్ ని నిర్వహించడానికి బీసీసీఐ పావులు కదుపుతోంది.

కరోనా వైరస్ ఉధృతి కారణంగా ఐపీఎల్ ఈ ఏడాది వాయిదా పడింది. అలాగే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు కూడా వాయిదా పడ్డాయి. త్వరలోనే ఈ కరోనా బారి నుంచి బయట పడాలని ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది.

Next Story