ఫ్రెండ్ చెల్లితో ప్రేమ‌.. న‌మ్మ‌కంగా పిలిచి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 May 2020 7:29 AM GMT
ఫ్రెండ్ చెల్లితో ప్రేమ‌.. న‌మ్మ‌కంగా పిలిచి

మచిలీపట్నంలో దారుణం జరిగింది. ప్రియురాలితో మాట్లాడేందుకు అడ్డు వ‌స్తున్నాడ‌న్న కోపంతో ఓ యువ‌కుడు త‌న ప్రియురాలి అన్నను దారుణంగా హ‌త‌మార్చాడు. పోలీసుల క‌థ‌నం మేర‌కు.. మ‌చిలీప‌ట్నం అమృత‌పురం చెందిన య‌ర్రంశెట్టి సాయి(21) అదే ప్రాంతానికి చెందిన స‌య్య‌ద్ యాసిన్ లు స్నేహితులు. యాసిన్ పెయింటింగ్ ప‌నులు చేస్తుండేవాడు. సాయి కోసం యాసిన్ ప్ర‌తి రోజు అత‌డి ఇంటికి వెళ్లేవాడు. ఈ క్ర‌మంలో సాయి చెల్లితో అత‌డికి ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది. ఈ విష‌యం సాయికి తెలిసింది. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వలు జ‌రిగాయి. త‌న చెల్లితో మాట్లాడ‌వ‌ద్దని, తిర‌గ‌వ‌ద్ద‌ని ప‌లు మార్లు సాయి.. యాసిన్‌ను హెచ్చరించాడు.

త‌న ప్రియురాలిని క‌లిసేందుకు సాయి అడ్డువ‌స్తుండ‌డంతో అత‌న్ని అడ్డు తొల‌గించుకుంటే హాయిగా ప్రియురాలిని క‌ల‌వ‌చ్చ‌ని బావించాడు యాసిన్‌. పార్టీ పేరుతో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నాం సాయిని యాసిన్ ఆంధ్ర జాతీయ క‌ళాశాల వెనుక వైపు ఉన్న ఖాళీ ప్ర‌దేశానికి తీసుకెళ్లాడు. అక్క‌డ ఇద్ద‌రూ క‌లిసి మ‌ధ్యం సేవించారు. ప‌థ‌కం ప్ర‌కారం సాయి తాగే మ‌ద్యంలో సైనెడ్ క‌లిపాడు స‌య్య‌ద్. ఆ మ‌ద్యాన్ని తాగిన సాయి అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లాడు. చ‌నిపోయాడు అని బావించిన యాసిన్ అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు. సాయిని గ‌మ‌నించిన స్థానికులు ఎండ దెబ్బ‌కు ప‌డిపోయి ఉంటాడ‌ని భావించి ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా.. మార్గ‌మ‌ధ్యంలో మ‌ర‌ణించాడు. సాయి త‌ల్లి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story
Share it