ప్రాణం తీసిన వివాహేత‌ర సంబంధం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 May 2020 2:08 PM GMT
ప్రాణం తీసిన వివాహేత‌ర సంబంధం

లాక్‌డౌన్ కార‌ణంగా క్రైమ్ రేట్ త‌గ్గుతుంద‌ని భావిస్తుండ‌గా... వ‌రుస హ‌త్య‌లు భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. అక్ర‌మ సంబంధాల మోజులో ప‌డి ఎంద‌రో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. త‌మ విష‌యం బ‌య‌ట‌ప‌డ‌డంతో క్ష‌ణికావేశంలో ఘోర త‌ప్పిదాల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా వ‌న‌ప‌ర్తి జిల్లాలో ఓ యువ‌కుడి గొంపుకోసి చంపేసింది మ‌హిళ‌.

ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే.. అచ్చంపేట మండలంలోని మన్ననూర్ కు చెందిన ఆంజనేయులు (22)కు అదే గ్రామానికి చెందిన బాలమ్మ అనే మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది. ఇద్ద‌రు త‌మ వ్య‌వ‌హారం ఎవ‌రికి తెలియ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. ఇలా రెండు సంవ‌త్స‌రాలు గ‌డిచాయి. కాగా.. ఇటీవ‌ల వీరి వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డింది. దీంతో గ్రామ పెద్ద‌లు ఆంజ‌నేయుల త‌ల్లి, మామ‌ల‌ను పిలిపించి ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని, అత‌డికి బుద్ది చెప్పాల‌ని సూచించారు. పెళ్లి చేస్తే కుమారుడు దారిలోకి వ‌స్తాడ‌ని బావించిన అత‌డి త‌ల్లి.. మామ శ్రీనివాసులు కుమారైను ఇచ్చి పెళ్లిచేయ‌డానికి నిశ్చ‌యించింది. త‌న‌కు వివాహాం నిశ్చ‌య‌మైంద‌న్న విష‌యం బాల‌మ్మ‌కు చెప్పాడు ఆంజ‌నేయులు. అదే రోజు రాత్రి ఇద్ద‌రూ క‌లిసి మ‌ద్యం తాగారు. పెళ్లి విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. ఆగ్ర‌హాంతో బాల‌మ్మ క‌త్తిలో ఆంజ‌నేయులు గొంతుకోసి హ‌త్య చేసింది. అనంత‌రం ఆ మృత‌దేహాన్ని గోనె సంచిలో చుట్టి డ్రైనేజీలో ప‌డేసి ఏమీ ఎర‌గ‌న‌ట్టు న‌టించింది.

ఆంజ‌నేయులు క‌నిపించ‌క‌పోవ‌డంతో.. అత‌డి త‌ల్లి స్థానిక పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. రెండు రోజుల త‌రువాత మన్ననూర్ ఎస్బీఐ ఎదుట ఉన్న కల్వర్టు నుంచి దుర్వాసన రావ‌డంతో.. స్థానికులు పోలీసుల‌కు తెలిపారు. అక్క‌డికి చేరుకున్న పోలీసులు గోనె సంచిలో ఉన్న మృత‌దేహాం ఆంజ‌నేయులుగా గుర్తించారు. పోలీసుల విచార‌ణ‌లో చేసిన నేరాన్ని బాల‌మ్మ బ‌ప్పుకుంది.

Next Story