మద్యం ఎఫెక్ట్: ఫోన్ ఎత్తలేదని భార్యపై గొడ్డలితో దాడి చేసిన భర్త

By సుభాష్  Published on  6 May 2020 4:29 AM GMT
మద్యం ఎఫెక్ట్: ఫోన్ ఎత్తలేదని భార్యపై గొడ్డలితో దాడి చేసిన భర్త

రోజురోజుకు నేరాలు ఎక్కువైపోతున్నాయి. కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో క్రైమ్‌ రేటు పూర్తిగా తగ్గిపోయింది. ఇక కేంద్రం సూచనతో ఏపీలో తెరుచుకున్న మద్యం దుకాణాలతో మందు బాబులు పండగ చేసుకుంటున్నారు. అంతేకాదు నేరాలు కూడా మొదలయ్యాయి. పచ్చని కాపురంలో మద్యం పెద్ద చిచ్చే పెట్టేసింది.

తాజాగా కడప జిల్లా పుల్లంపేటలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ భర్త భార్యను గొడ్డలితో దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. భార్య ఫోన్‌ ఎత్తలేదన్న కారణంగాతో మద్యం మత్తులో ఉన్న భర్త భార్యపై దాడికి దిగాడు. తలపై బలమైన గాయాలు కావడంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story
Share it