అతడిని పట్టుకోడానికి సమాచారం ఇస్తే 2.5 లక్షలు మీ సొంతం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 July 2020 10:56 AM GMT
అతడిని పట్టుకోడానికి సమాచారం ఇస్తే 2.5 లక్షలు మీ సొంతం..!

ఉత్తరప్రదేశ్ రౌడీ మూకలు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు మృతి చెందిన సంగతి బయటకు రావడంతో గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే పేరు దేశ వ్యాప్తంగా వినిపించింది. వికాస్ దూబేను పట్టుకోడానికి ఏకంగా 25 టీమ్ లను ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల్లో రైడ్స్ నిర్వహిస్తూ ఉన్నామని, ఇతర రాష్ట్రాల్లో కూడా నిఘా ఉంచారు అధికారులు. ఇప్పటికే వికాస్ దూబే అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు. వికాస్ దూబేను పట్టించడానికి సమాచారం ఇస్తే 2.50 లక్షల రూపాయలు ఇస్తామని పోలీసు అధికారులు సోమవారం నాడు తెలిపారు.

Vikas Dubey

వికాస్ దూబేను పట్టుకోడానికి సమాచారం ఇచ్చిన వారికి క్యాష్ ప్రైజ్ 2.50 లక్షలు చేశామని.. ఇంతకు ముందు 50000 ప్రకటించామని ఇప్పుడు ఆ క్యాష్ ప్రైజ్ ను పెంచామని పోలీసు అధికారులు తెలిపారు. మొదట 50000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇస్తామని చెప్పగా, ఆదివారం నాడు లక్ష రూపాయలు చేశారు. సోమవారం నాటికి రెండున్నర లక్షలు ఇస్తామని ఉత్తరప్రదేశ్ డీజీపీ ఆఫీసు తెలిపింది.

60కేసుల్లో నిందితుడిగా ఉన్న వికాస్‌దూబేను పట్టుకునేందుకు గురువారం అర్థరాత్రి పోలీసులు వెళ్లగా.. ఓ ఇంటిపై మాటువేసిన దుండగులు పోలీస్‌ బృందంపై బులెట్ల వర్షం కురింపించారు. దీంతో డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర మిశ్రా సహా ముగ్గురు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్లు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలను వికాస్ దూబే అనుచరులు తీసుకుని వెళ్లిపోయారు. పోలీసులు వస్తున్నారన్న సమాచారం ముందుగానే అతడికి చేరిపోయిందని అధికారులు అనుమానిస్తూ ఉన్నారు. ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు అధికారులు. ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, ఒక కానిస్టేబుల్ ను విధుల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రిలిమినరీ ఎంక్వయిరీ ముగిసిన తర్వాత ముగ్గురు పోలీసులు, ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు కున్వార్ పల్, కృష్ణ కుమార్ శర్మ, కానిస్టేబుల్ రాజీవ్ ను విధుల నుండి తొలగిస్తూ కాన్పూర్ ఎస్.ఎస్.పి. దినేష్ కుమార్ తెలిపారు. వీరు ముగ్గురూ చౌబేపూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వ‌హిస్తూ ఉండేవారు. ఈ ముగ్గురిపై ఎఫ్.ఐ.ఆర్. కూడా నమోదు చేశారు. దూబేకు పోలీసులు వస్తున్నారంటూ సమాచారం ఇచ్చింది వీరేనని అధికారులు అనుమానిస్తూ ఉన్నారు.

Next Story
Share it