ఆయన మాటే శాసనమా.. మోదీ మీ చెవిలో ఏమైనా చెప్పారా..?

By అంజి  Published on  29 Dec 2019 1:08 PM GMT
ఆయన మాటే శాసనమా.. మోదీ మీ చెవిలో ఏమైనా చెప్పారా..?

ముఖ్యాంశాలు

  • మూడు రాజధానులపై ప్రకటన రాకముందే ఆరోపణలు చేయడం కరెక్ట్‌ కాదు- బొత్స
  • ఆర్థిక పరిస్థితులు తెలుసుకోకుండా బాబు విచ్చలవిడిగా ఖర్చు చేశారు- బొత్స
  • ఇప్పుడున్న 13 జిల్లాల్లో రాజధానికి విశాఖే సరైన ప్రాంతం- మంత్రి బొత్స

విశాఖ: రాష్ట్ర అభివృద్ధి, భౌగోళిక పరిశీలనపై హైపవర్‌ కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి బొత్స అన్నారు. ఏపీ రాజధానుల అంశంపై జీఎన్‌రావు కమిటీ ఇప్పటికే నివేదిక సమర్పించిందన్నారు. బీసీజీ కమిటీ నివేదికను కూడా హైపవర్‌ కమిటీ పరిశీలిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. నివేదికలను హైపవర్‌ కమిటీ అధ్యయనం చేస్తుందని.. 21 రోజుల్లో సిఫార్సులు ఇస్తుందన్నారు. తమ ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తొందని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వం విధానమని, హైపవర్‌ కమిటీ ముఖ్య ఉద్దేశం కూడా 13 జిల్లాల అభివృద్దేనన్నారు. మూడు రాజధానులపై ప్రకటన రాకముందే ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం కరెక్ట్‌ కాదని మంత్రి బొత్స అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తెలుసుకోకుండా చంద్రబాబు విచ్చలవిడిగా ఖర్చు చేశారని పేర్కొన్నారు. జీఎన్‌రావు, బీసీజీ కమిటీ రిపోర్టులతో పాటు హైపవర్‌ కమిటీ ఇచ్చే నివేదికను సమన్వయం చేస్తామన్నారు.

ఇప్పుడున్న 13 జిల్లాల్లో రాజధానికి విశాఖే సరైన ప్రాంతమని మంత్రి బొత్స వ్యాఖ్యనించారు. హైపవర్‌ కమిటీ నివేదికపై కేబినెట్‌ భేటీలో చర్చిస్తామన్నారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడం చంద్రబాబుకు ఇష్టమా? కాదా? చెప్పాలని బొత్స ప్రశ్నించారు. బీజేపీలో చేరిన టీడీపీ నేతల మాటలు, చంద్రబాబు మాటలు ఒకేలా ఉన్నాయని విమర్శించారు. బీజేపీలో చేరిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు ఏపీకి మూడు రాజధానులు వీలుకాదంటున్నారు. ఆయన మాటే శాసనమా? మోదీ తమ చెవిలో ఏమైనా చెప్పారా? అంటూ బొత్స ప్రశ్నించారు. అశోక గజపతిరాజులకు విశాఖలో ఎగ్జిక్యూటీవ్‌ క్యాపిటర్‌ పెట్టడం ఇష్టమో, కాదో చెప్పాలన్నారు. చంద్రబాబు ఎవరిచ్చారు అధికారమంటున్నారు, మరీ హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చినప్పుడు మీకు (చంద్రబాబు) అధికారం ఎవరిచ్చారని మంత్రి బొత్స అడిగారు.

విశాఖ ప్రాంతానికి చంద్రబాబు వల్ల ఏమైనా మేలు జరిగిందా? అని బొత్స ప్రశ్నించారు. సుజనా చౌదరి సీబీఐ ఎంక్వైరీ ఎందుకంటున్నారో చెప్పాలన్నారు. తాము సీబీఐ వేస్తామని చెప్పలేదని.. మీ పాత స్నేహితులే సీబీఐ ఎంక్వైరీ వేయమన్నారని బొత్స పేర్కొన్నారు. ఇన్‌సైడ్ ట్రేడింగ్ అరోపణలను ఆయన తోసిపుచ్చారు. సమర్పిస్తుందని సున్నితంగా

గతంలో చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు ఆయన అనుచరులు, బంధువులు భూఅక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. బాలకృష్ణకు, ఆయన కుమారుడికి భూములను అధిక మొత్తంలో భూములను కేటాయిచారని అన్నారు. తరువాత రెండు నెలల ఆగి ఆ భూములను సిఆర్డీఏ లో కలిపేశారని అన్నారు. సిట్ విచారణ చేపడితే టీడీపీ నాయకుల బాగోతాలన్ని బట్టబయలవుతాయని అన్నారు.

Next Story