సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను చంపేస్తామంటూ బెదిరింపు

By సుభాష్  Published on  23 May 2020 4:06 PM GMT
సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను చంపేస్తామంటూ బెదిరింపు

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి.. సంచనాలకు మారుపేరుగా ఎంతో పేరుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వ అధికారుల్లో దడ పుట్టిస్తున్నాడు. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అంతేకాదు విధి నిర్వహణలో అలసత్వం వహించిన ప్రభుత్వ ఉద్యోగులపై కొరఢా ఝులిస్తున్నారు. అలాంటిది యోగి ఆదిత్యానాథ్‌కు బాంబులతో హతమారుస్తామంటూ ఓ బెదిరింపు మెసేజ్‌ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌ క్వార్డర్స్‌ కార్యాలయ వాట్సాప్‌ నెంబర్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి అభ్యంతకర పదజాలంతో ఈ మెసేజ్‌ను చేరవేశాడు. సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, మరో వర్గానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మెసేజ్‌ను పంపాడు.

యోగి ఆదిత్యానాథ్‌ను బాంబుతో దాడి చేసి హతమారుస్తామంటూ హెచ్చరించారు. మెసేజ్‌ను చూసి అప్రమత్తమైన పోలీసులు మెసేజ్‌ చేసిన అగంతకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మెసేజ్‌ ఎక్కడి నుంచి, ఏ నెంబర్‌ నుంచి వచ్చిందో విచారణ చేపడుతున్నారు. దీనిపై లక్నోలోని గోమతినగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్‌ 505 (1)(బి), అలాగే సెక్షన్ 506, 507 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకున్న యూపీ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే పాలన విషయంలో అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ఏ తప్పు జరిగిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసేస్తారు. ప్రజలకు ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే స్పందించే రకం.

Next Story
Share it