ఇంట్లో పేలిన బాంబు.. ఇద్దరి మృతి
By తోట వంశీ కుమార్ Published on 7 Sep 2020 9:35 AM GMTపశ్చిమ బెంగాల్‌లోని ఓ ఇంట్లో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కామర్హటి గోలాఘాట్ ప్రాంతంలోని ఓ ఇంట్లో నాటు బాంబు పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులని షేక్ రాజు (35), మహ్మద్ సాహిద్ గా గుర్తించారు.
సమాచారం వచ్చిన తరువాత, కమర్హతి అవుట్ పోస్ట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన నలుగురిని సమీపంలోని దవాఖానకు తరలించారు. అందులో ఇద్దరు చనిపోయినట్లు ప్రకటించగా.. ఒకరు తీవ్రంగా గాయపడి సాగర్ దత్తా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంటి లోపల గది అంతా దుస్తులు, ఫర్నిచర్ భాగాలు, రక్తపు మరకలతో కనిపించాయి. పేలుడుకు కారణాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు, ఉత్తర 24 పరగణ జిల్లాల్లోని బరాక్‌పూర్ ప్రాంతం 2019 నుండి రాజకీయ హింసకు కేంద్రంగా మారింది.