బిగ్ బాస్ లో బిగ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన నందినీ రాయ్ గుర్తుందా? గుడ్ లుక్స్, గ్రేస్, గన్ షాట్ టాలెంట్‌కి మారుపేరుగా అభిమానుల్ని కుప్పతెప్పలుగా సంపాదించుకున్న ఈ భామ ఇప్పుడు బాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. సిల్లీ ఫెలోస్, మోసగాళ్లకు మోసగాడు వంటి సినిమాల్ల్లో నటించినా మాజీ మిస్ హైదరాబాద్ అయిన నందినీ రాయ్ టాలీవుడ్ బస్సు మిస్సైపోయింది. ఇప్పుడు టాలీవుడ్ కాదన్న ఈ బ్యూటీకి బాలీవుడ్ స్వాగతం పలుకుతోంది.

కొత్త దర్శకుడు హుస్సేన్ ఉత్తరప్రదేశ్ గ్రామీణ నేపథ్యంలో రాజకీయ ఆధారిత చిత్రాన్నినిర్మిస్తూ అందులో మహిళా రాజకీయవేత్త పాత్రకు నందినీ రాయ్ ను ఎంపిక చేశాడు. కాలేజీ గర్ల్ నుంచి పాలిటీషియన్ గా రూపెత్తి, కాటన్ చీరలు ధరించి, నమస్కారాలు పెట్టే పాత్రను మన నందిని పోషించబోతోంది. సోషల్ మీడియాలో ఆమె పోస్టులు, ఆమె పాత సినిమాలను చూసి దర్శకుడు ఆమెను ఎంపిక చేశాడు. ఆమె ఇన్ స్టాగ్రామ్ పోస్టులు దర్శకుడిని, నిర్మాతను ఎంతో ఆకర్షించాయి. వాళ్లు ఏకంగా హైదరాబాద్ కి వచ్చి ఆమెకు కథ వినిపించారు. ఆమె ఇంప్రెస్ అయిపోయింది. పలు మార్లు ఆడిషన్ ఇచ్చిన తరువాత ఆమెను వారు ఎంపిక చేశారు.

బాలీవుడ్ అంటే అంత ఆషామాషీ కాదని నందినికి తెలుసు. తన ఫిగరు బాలీవుడ్ హీరోయిన్ల ఫిగర్ కాదని కూడా ఆమెకు తెలుసు. బాలీవుడ్ ఫిట్ నెస్ లెవెల్సూ తెలుసు. అందుకే ఈ ఆఫర్ రాగానే ఆమె సరాసరి జిమ్ కి పరుగెత్తి, చెమటోడ్చడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఆమె లండన్ లో మంజిమా మోహన్, విష్ణు విశాల్ లు నటించిన సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది.

అంజి గోనె

Next Story