అల్లు అర‌వింద్ కి షాక్ ఇచ్చిన మ‌మ్ముట్టి

By Newsmeter.Network  Published on  3 Dec 2019 10:24 AM GMT
అల్లు అర‌వింద్ కి షాక్ ఇచ్చిన మ‌మ్ముట్టి

మ‌ల‌యాళ అగ్ర హీరో మ‌మ్ముట్టి న‌టించిన తాజా చిత్రం మ‌మంగ‌మ్. ఈ సినిమాని తెలుగులో గీతా ఆర్ట్స్ సంస్థ రిలీజ్ చేస్తుంది. ఈ రోజు మూవీ ట్రైల‌ర్ ను రిలీజ్ చేసారు. ప్ర‌సాద్ ల్యాబ్స్ లో జ‌రిగిన ఈ వేడుక‌కు గీతా ఆర్ట్స్ అధినేత‌, మోగా నిర్మాత అల్లు అర‌వింద్ ముఖ్య అతిధిగా హాజ‌రై మ‌మంగ‌మ్ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ను రిలీజ్ చేసారు.

ఈ సంద‌ర్భంగా అల్లు అర‌వింద్ మాట్లాడుతూ... మమ్ముట్టితో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌ను గుర్తు చేసుకున్నారు. స్వాతి కిర‌ణం సినిమాకి కె.విశ్వ‌నాథ్ గారు మ‌మ్ముట్టిని ఎంచుకున్నారు అని తెలిసి.. ఆ పాత్ర‌ను మ‌మ్ముట్టి ఎలా చేస్తారు..? తెలుగు ఆడియ‌న్స్ ని ఎలా మెప్పిస్తాడు..? అనుకున్నార‌ట‌. ఆత‌ర్వాత స్వాతి కిర‌ణం సినిమా చూసి అందులో మ‌మ్ముట్టి అద్భుతంగా న‌టించ‌డంతో ఆయ‌న‌కే ఫోన్ చేసి చెప్పార‌ట‌.

ఆత‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో అల్లు అర‌వింద్ ఓ సినిమా నిర్మిస్తున్న టైమ్ లో విల‌న్ పాత్ర‌కు మమ్ముట్టి అయితే బాగుంటుంద‌ని భావించి.. ఆయ‌న‌కి ఫోన్ చేసి ప‌వ‌న్ క‌ళ్యాన్ హీరో, మీరు విల‌న్ పాత్ర చేస్తారా అని అడిగితే...? ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా చేసే ఈ సినిమాలో విల‌న్ గా న‌టించ‌మ‌ని చిరంజీవి గార్ని అడ‌గ‌గ‌ల‌రా అని ప్ర‌శ్నించార‌ట మ‌మ్ముట్టి. ఆ విధంగా త‌న‌కు మ‌మ్ముట్టి షాక్ ఇచ్చార‌ని స్వ‌యంగా అల్లు అర‌వింద్ ఈ వేడుక‌లో చెప్ప‌డం విశేషం.

Next Story