డార్లింగ్‌తో నటించే ఛాన్స్ వచ్చినా.. భారీగానే డిమాండ్ చేస్తోందట..!
By తోట వంశీ కుమార్ Published on 15 April 2020 4:10 PM IST'బాహుబలి' సినిమాతో ప్రభాస్ రేంజ్ మారిపోయింది. 'సాహో' సినిమాతో బాలీవుడ్ హిందీ హీరోలతో సమానంగా మార్కెట్ ఉందని నిరూపించుకున్నాడు ప్రభాస్. తెలుగులో ఆ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ కాకున్న హిందీలో మాత్రం మాస్ ఆడియెన్స్ నుంచి క్లాస్ ఆడియోన్ప్ వరకు అందరిని అలరించింది. చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లకి ఈ యంగ్ రెబల్ స్టార్.. ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. ప్రభాస్‌తో నటించేందుకు అవకాశం వస్తే చాలు.. మేం సిద్దం అంటూ చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. 'సాహో' సినిమాలో నటించిన బాలీవుడ్ ముద్దు గుమ్మ శ్రద్దా కపూర్.. మరోసారి యంగ్ రెబల్ స్టార్ తో జోడి కట్టడానికి సిద్దం అని ఎప్పుడో చెప్పేసింది. అయితే.. ఓ బాలీవుడ్ ముద్దుగుమ్మ మాత్రం ప్రభాస్ సినిమాలో ఛాన్స్ వస్తే.. రెమ్యూనరేషన్ దగ్గర తెగబేరలాడుతోందట.
ఆమె ఎవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనె. వైజయంతి ప్రొడక్షన్ లో 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్.. ప్రభాస్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అందులో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన దీపిక పడుకొనెను సంప్రదించాడట. అయితే.. అమ్మడు చెప్పిన రెమ్యునరేషన్ చూసి షాక్ అయ్యాడట. అమ్మడు ఏకంగా 20 నుంచి 25 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
'పద్మావత్' సినిమా అనంతరం ఓక్కో సినిమాకు రూ.15కోట్ల పారితోషికం అందుకుంటుంది ఈ బ్యూటీ. పాన్ ఇండియా మూవీ అని తెలిసి ఇలా పారితోషికాన్ని భారీగా పెంచేసిందట. దీంతో దర్శక నిర్మాతలు ఆలోచనల్లో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సౌత్ సినిమాల విషయంలో ఇప్పటికే చాలా సార్లు అమ్మడు.. పారితోషికం నచ్చక వదిలేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మరీ ఇది ఎంత వరకు నిజయో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.