చంబల్ నదిలో పడవ బోల్తా.. 10 మంది గల్లంతు
By తోట వంశీ కుమార్Published on : 16 Sept 2020 11:34 AM IST

రాజస్థాన్‌లో విషాదం చోటుచేసుకుంది. చంబల్ నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది గల్లంతైయ్యారు. కోటా జిల్లాలోని ఇటావా పట్టణానికి సమీపంలోని ఖతోలీ ప్రాంతంలో చంబల్ నదిని దాటుతున్న ఒక పడవ నీట మునింది. ప్రమాద సమయంలో పడవలో 50 మంది ప్రయాణీకులు ఉన్నారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటే స్థానికులు, అధికారులు అక్కడకు చేరుకుని 40 మంది క్షేమంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. మరో 10 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.
Also Read
భారత్లో కరోనా విలయతాండవం..గల్లంతైన వారి కోసం అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక మీడియా కథనం ప్రకారం.. గోఠలా కాలా సమీపంలోని కమలేశ్వర్ ఆలయానికి వెలుతుండగా.. చంబల్ నదిలో పడవ బోల్తా పడింది. ఈ పడవలో 14 బైక్‌లు కూడా ఉన్నట్లు తెలిసింది. పడవలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించిన కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Next Story