బోరు నుంచి రక్తం, మాంసం.. అది దెయ్యాల ప‌నేనా..!

By జ్యోత్స్న  Published on  13 Dec 2019 2:39 AM GMT
బోరు నుంచి రక్తం, మాంసం.. అది దెయ్యాల ప‌నేనా..!

హర్రర్ సినిమాల్లో రాత్రిపూట, ఒంటరిగా ఉన్నపుడు టాప్ ఆన్ చేస్తే అందులోంచి రక్తం రావటం, బాత్ టబ్ పూర్తిగా రక్తం తో నిండిపోవటం లాంటి సీన్లు వస్తుంటాయి. అలాంటివి మీరెప్పుడైనా లైవ్ లో చూశారా. ఇప్పుడు అలాంటి సీనే ఉత్తరప్రదేశ్ హమీర్‌పూర్ జిల్లాలో కనిపించింది. అయితే, సినిమాల్లో చూపించినట్లు ఇంట్లో, ఒంటరిగా ఉన్నపుడు కాకుండా ఆ రక్తం ఓ హ్యాండ్ పంపు నుంచి వస్తోంది. ఖాజోడీ గ్రామం ఎప్పటి నుంచో నీటి ఎద్దడి ఎదుర్కొంటోంది. దీంతో ఆ గ్రామానికి అధికారులు ఇటీవల హ్యాండ్ పంపు వేశారు. కొన్నాళ్లు అందులో నుంచి నీరు బాగానే వచ్చింది.

ప్రజలు తమకు ఇక నీటి ఇబ్బందులు తీరాయని సంతోషించారు. అయితే, గత కొద్ది రోజులుగా ఆ హ్యాండ్ పంపు నుంచి నీరుకు బదులు రక్తం వస్తోంది. అప్పుడప్పుడు మాంసం, ఎముకలు కూడా బయటపడుతున్నాయి. నీరు కూడా దుర్వాసన వస్తోంది. దీంతో ప్రజలు ఆ పంపు దగ్గరకు వెళ్లాలంటేనే హడలిపోతున్నారు. ఈ సమస్యను హమీర్‌పూర్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. బోరును పరిశీలించిన అధికారులు.. లోపల రక్తం ఆనవాళ్లు లేవని చెప్పారు. హ్యాండ్‌ పంప్‌ లోపల పాము చనిపోయి ఉంటుందని అందుకే నీళ్లలో రక్తం వస్తుందని చెప్పినప్పటికీ.. గ్రామస్తులు మాత్రం నమ్మడం లేదు. మరోవైపు దీనిపై రకరకాలు మూఢ నమ్మకాలు వ్యాపిస్తున్నాయి. దీంతో మూఢ నమ్మకాలు వద్దంటూ అధికారులు ప్రచారం కూడా చేపట్టాల్సి వచ్చింది.

Blood and meat

Next Story