ఆ విషయంలో ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు.!

By అంజి  Published on  1 April 2020 5:10 AM GMT
ఆ విషయంలో ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు.!

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. మహమ్మారి కరోనా తరమికొట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న చర్యలకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. ఈ విషయమై సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. దేశ వ్యాప్తంగా విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని.. ఈ క్రమంలోనే పేద, సామాన్య ప్రజల లబ్ది కోసం ప్రధాని మోదీ సుమారు రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చారని లేఖలో వివరించారు. అలాగే రాష్ట్ర కార్మిక శాఖ వద్ద నమోదైన సుమారు 14 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కోసం ఉద్దేశించిన రూ.2,300 కోట్ల సెస్‌ నిధుల ఉన్నాయని.. వాటిని ఖర్చు చేసే అవకాశం కల్పిస్తూ కేంద్ర కార్మిక శాఖ ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు.

Also Read: ఏపీలో 63కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులకు దీనికి అనుగుణంగా నేరుగా డబ్బులు పంపించే ఏర్పాటు చేయాలని బండి సంజయ్‌ కోరారు. అలాగే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలతో చర్చించకుండా జీతాల్లో 50 శాతం విధించడం సరికాదని, దీనిపై మరోసారి పునరాలోచించుకోవాలని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ విజ్ఞప్తి చేశారు. జీతంపై ఆధారపడి బతికే ఉద్యోగులకు 50 శాతం కోత విధిస్తే వారి జీవన పరిస్థితి కష్టంగా మారుతుందన్నారు.

Also Read: దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌.. పెరుగుతున్న కేసులు, మరణాల సంఖ్య

Next Story
Share it