హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆదివారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను గెలిచే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా ‘సంకల్ప్‌ పత్ర్‌’ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలో యువతకు, మహిళలకు, రైతులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు జేపీ నడ్డా తెలిపారు. రైతులకు, కార్మికులకు, పారిశ్రామిక వేత్తలను అన్ని రకాలుగా ఆదుకుంటామని జేపీ నడ్డా పేర్కొన్నారు. 25 లక్షల మంది యువతకు ఉద్యోగాల సాధన కోసం ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలల్లో భాగంగా జాతీయ ప్రాధాన్య అంశాలనే బీజేపీ ప్రధాన ప్రచారస్త్రాలుగా వాడుకుంటోంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.