సీఏఏకు మద్దతుగా బీజేపీ భారీ ర్యాలీ.. ఎక్కడో తెలిస్తే షాకే..!
By అంజి
కరీంనగర్: పౌరసత్వ సవరణ చట్టానికి మద్దుతుగా రేపు భారీ ర్యాలీ నిర్వహిస్తామని ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో సోమవారం భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సీఏఏ పై అవగహన కల్పించేందుకే ఈ ర్యాలీ చేపడుతున్నామని అన్నారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో కేంద్రమంత్రి ఆర్థిక శాఖ సహాయక మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొననున్నారు. పౌరసత్వ సవరణకు మద్దతుగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు ర్యాలీలో పాల్గొనాలని బండి సంజయ్ అన్నారు. ప్రతిపక్షాలు సీఏఏను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో చెప్పాలన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా ఇస్లాం దేశాల నుంచి వస్తున్న నిధులతోనే ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయని బండి సంజయ్ మండిపడ్డారు. అయితే మన రాష్ట్రంలో మాత్రం అధికార పార్టీనే దగ్గరుండి ఆందోళనలు చేయిస్తోందని ఆరోపించారు. తాము హిందువులకు వ్యతిరేకం కాదన్న అసదుద్దీన్ ప్రకటనను నమ్మడానికి వీలేదన్నారు. కొన్ని పార్టీలు దేశం గురించి అభ్యంతరకంరగా మాట్లాడం సరికాదని బండి సంజయ్ అన్నారు.