బీజేపీ నేతపై లైంగిక ఆరోపణలు.. కాఫీలో మత్తు మందు కలిపి..
By అంజి Published on 3 Feb 2020 3:18 PM ISTహైదరాబాద్: బీజేపీ నేత రఘునందన్‌రావు తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని ఓ మహిళ సైబరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేసింది. మెదక్ జిల్లా ఆర్.సీ పురంకి చెందిన ఆ మహిళకు తన భర్తతో 2003 సంవత్సరంలో విబేధాలు వచ్చాయని.. దీంతో ఆర్.సీ.పురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని తెలిపింది. ఆ తర్వాత స్థానిక అడ్వకేట్ రఘునందన్ సలహామేరకు ఆమె తన భర్తపై మెయింటెనెన్స్ కేసు వేశానని.. 2007లో అడ్వకేట్ రఘునందన్‌రావు తనని ఆఫీసుకు పిలిపించుకున్నారని ఆ మహిళ తెలిపింది.
కాఫీలో మత్తు మందు కలపి ఆఫీసులో తనపై అత్యచారానికి పాల్పడినట్లు, అదే సమయంలో తన అశ్లీల చిత్రాలు తీసుకున్నాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయాన్ని బయట ఎవరికైనా చెబితే అశ్లీల చిత్రాలను సోషల్ మీడియాలో పెడతానంటూ రఘునందన్‌రావు బెదిరిస్తున్నాడంటూ మహిళ ఆరోపణలు చేసింది. అప్పటి నుంచి తరచూ తనపై రఘునందన్‌రావు తన అత్యచారం చేసే వాడని మహిళ పేర్కొంది. ఈ విషయమై ఎచ్‌ఆర్సీనీ ఆశ్రయించగా రఘునందన్‌రావుపై కేసు నమోదు చేయాలని గత నెలలో ఆర్డర్ ఇచ్చారని తెలిపారు. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని సీపీ సజ్జనార్‌ను కలిశానని మహిళ తెలిపింది.
రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ నన్ను టార్చర్ పెట్టాడని, తన కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ మార్చేశాడని తెలిపింది. రఘునందన్ వల్ల తనకు, తన కుమారుడికి ప్రాణహాని ఉందని బాధితురాలు వాపోయింది. తన భర్తతో కలిసి రఘునందన్ కిడ్నాప్ చేశాడని, ఇద్దరూ కలిసి తనపై సామూహిక అత్యాచారం చేశారని బాధితురాలు ఆరోపించింది. హీరో రవితేజ తమ్ముడికి బ్లూ ఫిల్మ్స్ సప్లై చేసేది రఘునందనే అంటూ మహిళ వ్యాఖ్యనించింది. కేసుల పరిష్కారం కోసం వచ్చే ఆడవారిని రఘునందన్ భయపెట్టి లొంగదీసుకుంటాడని.. వారితో బ్లూ ఫిల్మ్స్ తీసి రాజకీయ నాయకులకు పంపిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడని బాధితురాలు సంచలన ఆరోపణలు చేసింది.