కరోనాతో మరో ఎంపీ కన్నుమూత

By సుభాష్
Published on : 17 Sept 2020 4:51 PM IST

కరోనాతో మరో ఎంపీ కన్నుమూత

కరోనా మహమ్మారి ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. రోజురోజుకు తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. తాజాగా కరోనా బారిన పడ్డ రాజ్యసభ సభ్యుడు అశోక్‌ గస్తీ (55) మృతి చెందారు. కోవిడ్ బారిన పడ్డ ఆయన సెప్టెంబర్‌ 2న బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో ఆరోగ్యం మరింత క్షీణించడంతో గురువారం తుది శ్వాస విడిచారు.

కర్ణాటకకు చెందిన అశోక్‌ గస్తీ ఏడాది జరిగిన ఎన్నికల్లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. అశోక్‌ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌లోచేరి, తదనంతరం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌లో పని చేశారు. 18 ఏళ్ల వయసులోనే బీజేపీలో చేరి రాష్ట్ర యువ మోర్చా లో కీలక బాధ్యతల నుంచి రాజ్యసభ వరకు అంచెలంచెలుగా ఎదిగారు. ఇక ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఎన్నికల్లో రాజ్యసభకు ఎన్నికైన అశోక్‌ గస్తీ . ఒక్కసారి కూడా పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనకుండా మరణించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం అవుతోంది.

Next Story