Fact Check : జీహాదీల కారణంగా స్వీడన్ లో 16 మంది మహిళలు తీవ్రగాయాలపాలయ్యారు అంటూ బీజేపీ నేత పోస్టు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Sept 2020 6:23 PM IST
Fact Check : జీహాదీల కారణంగా స్వీడన్ లో 16 మంది మహిళలు తీవ్రగాయాలపాలయ్యారు అంటూ బీజేపీ నేత పోస్టు..!

16 మంది స్వీడన్ కు చెందిన మహిళలకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రక్తం నిండిన వారి ముఖాలను చూసి అందరూ విస్తుపోతున్నారు. ఆ ఫోటోలో ఉన్న మహిళలు జీహాదీల చేతిలో తీవ్రంగా గాయపడ్డారని.. లేదా చంపివేయబడ్డారని పోస్టు చేస్తున్నారు.

చండీఘడ్ రాష్ట్రం బీజేపీ రాజకీయనేత గౌరవ్ గోయెల్ కూడా ఈ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. స్వీడన్ లోకి జీహాదీలను ఆహ్వానించారని.. ఇప్పుడు స్వీడన్ లో మహిళలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారని.. వారు జీహాదీలను ఆహ్వానించడమే వారు చేసిన తప్పని అందుకే మహిళలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారని ట్వీట్ చేశారు.

“Tolerance of Sweden has paved a way for them to be killed. Sweden allowed jihadis to come and now the citizens of Sweden are brutally killed or injured, that is not an accident…It is a choice they have made. #swedenriots https://t.co/CewgeUa9mQ,” అని రాసుకుంటూ వచ్చారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న ఈ పోస్టులో ఎటువంటి నిజం లేదు.

ఈ ఫోటోలపై న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ‘France 24 The Observers’ అంటూ 2018లో పోస్టు చేసిన ఆర్టికల్ లో చూడొచ్చు. ఫేక్ ఫోటోల కారణంగా జాత్యహంకార విద్వేషాన్ని ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చేస్తున్నారని అందులో చెప్పుకొచ్చారు.

నిజాలు తెలుసుకోకుండా వైరల్ చేస్తున్న వార్తలపై FRANCE 24 సంస్థ నిఘా పెట్టింది. ఇలాంటి ఫోటోలకు తప్పుడు వార్తలను జత చేసి విద్వేషాన్ని రెచ్చగొడుతూ ఉన్నారని తెలిపింది. చాలా వరకూ ఈ ఫోటోలు యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినవని స్పష్టం చేశారు.

Mimikama ఆస్ట్రేలియాకు చెందిన ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్ సైట్ ఈ ఫోటోలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంది. ఈ ఫోటోలలో ఉన్న మహిళలు గాయపడడానికి కారణం గృహ హింస, పోలీసుల దాడి.. ఇతర దాడులు అని స్పష్టం చేసింది.

మొహమ్మద్ జుబేర్ ఫ్యాక్ట్ చెకర్, ‘Alt News’ కో ఫౌండర్ మీరు చేస్తోంది తప్పుడు ప్రచారం అంటూ గౌరవ్ గోయెల్ కు ట్వీట్ చేశారు. 7-8 సంవత్సరాల పాత ఫోటోలను ముస్లింలకు వ్యతిరేకంగా పోస్టు చేస్తున్నారని తెలిపారు. అమెరికా, యుకే ప్రాంతాలకు చెందిన మహిళల ఫోటోలు ఇవి అని.. వలస వచ్చిన ముస్లింలకు వీటితో సంబంధం లేదని స్పష్టం చేస్తూ ట్వీట్ చేశారు.

జీహాదీల కారణంగా స్వీడన్ లో మహిళలు తీవ్రంగా గాయపడ్డారంటూ చేసిన ట్వీట్ నిజం కాదు. ఆ పోస్టులు 'పచ్చి అబద్ధం'.

Next Story