Fact Check : ఆసుపత్రి బెడ్ మీద నరకయాతన పడుతున్న యూపీ విద్యార్థి అంటూ వీడియో వైరల్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Sep 2020 11:48 AM GMT
Fact Check : ఆసుపత్రి బెడ్ మీద నరకయాతన పడుతున్న యూపీ విద్యార్థి అంటూ వీడియో వైరల్..!

ఓ యువకుడు ఆసుపత్రి బెడ్ మీద పడుకుని శ్వాస పీల్చడంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆగష్టు 2020న ఉత్తర ప్రదేశ్ లో బిఈడీ పరీక్షలు రాసిన ఆ వ్యక్తికి కోవిద్-19 సోకిందని ఇప్పుడు అతడి పరిస్థితి ఇలా ఉందంటూ వీడియోను వైరల్ చేస్తున్నారు.

పరీక్షలు జరగడం వలన కరోనా సోకే అవకాశం ఉందని.. దయచేసి నీట్ పరీక్షలు వాయిదా వేయాలంటూ ఈ వీడియోను పలువురు విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు.



”@Swamy39 @DrRPNishank BJP GOV FAILED TO PROVIDE STUDENTS SAFETY. Saurab Kumar was tested positive 3 days ago after giving UP BEd exam where NO SOP was followed. Postpone NEET & save students @nidhiindiatv

#INDIAunitedtoPostponeJEE_NEET https://t.co/EpTahZ5ptD” అంటూ ట్విట్టర్ లో పోస్టు చేశాడు మరో వ్యక్తి.



నిజ నిర్ధారణ:

ఈ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని సెర్చ్ చేయగా.. యూట్యూబ్ లో ఇదే వీడియోను మార్చి 29, 2020న పోస్టు చేశారు. ఆగష్టు నెలలో నిర్వహించిన బిఈడీ పరీక్షలకు ఆ వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టమవుతోంది.

ట్విట్టర్ లో కూడా మార్చి 23, 2020న సదరు యువకుడు ఉన్న పోస్టును పెట్టారు. పాకిస్థాన్ లో కరోనా, కరోనా పాకిస్థాన్ కు చేరుకుంది అనేలా ట్వీట్ చేశారు.



#CoronavirusPandemic #coronawarriors #CoronaVirusUpdates #coronaPakistan #CoronavirusLockdown #Covid_19india #covid_19pakistan అంటూ వీడియోను పోస్టు చేశారు.



రైటర్, కాలమిస్ట్ అయిన వికాస్ సరస్వత్ ఈ వీడియోను మార్చి 24, 2020న పోస్టు చేశారు. ఈ వీడియో పాకిస్థాన్ కు చెందినదని అందులో తెలిపారు. కరోనా వైరస్ కు సంబంధించిన వీడియో అని తెలిపారు.

ఈ వీడియోకు సంబంధించిన నిడివి ఎక్కువ ఉన్న వీడియోను యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. మార్చి 29, 2020న Kya Carona Virus Se Darna Chahiye ? అంటూ వీడియోను అప్లోడ్ చేశారు. ఆ వీడియోలో అంబులెన్స్ ఉండగా.. దాని మీద ‘Rescue 1122’ అంటూ ముందున ఉంది. ‘Rescue 1122’ అన్నది పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన ఎమర్జెన్సీ సర్వీస్ నెంబర్.

పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన వీడియోను.. ఉత్తరప్రదేశ్ లోని బిఈడీ ఎంట్రెన్స్ పరీక్షకు వెళ్లిన విద్యార్థికి లింక్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఆసుపత్రిలో జరిగిన ఉదంతం అన్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

Next Story