హైదరాబాద్: 30 అడుగుల గోతిలో పడ్డ బైక్.. తర్వాత ఏమైందంటే..

By సుభాష్  Published on  14 March 2020 4:08 AM GMT
హైదరాబాద్: 30 అడుగుల గోతిలో పడ్డ బైక్.. తర్వాత ఏమైందంటే..

హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్‌లో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి 30 అడుగుల గొయ్యిలో పడిపోయాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంతోష్‌ నగర్‌లోని ఓవైసీ ఎక్స్‌ రోడ్‌ లో ఓ బైక్‌ అదుపు తప్పి 30 అడుగుల లోతున్న ఓ గోతిలో పడింది. దీంతో బుల్టోజర్‌ సాయంతో పైకి తీశారు. తీవ్ర గాయాలైన వాహనదారున్ని ఆస్పత్రికి తరలించారు. బైక్‌పై వేగంగా వెళ్తూ అజాగ్రత్త నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

కాగా, హైదరాబాద్‌లో చాలా చోట్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంపై ప్రజలు మండిపడుతున్నారు. కొన్ని కొన్ని చోట్ల పెద్ద గుంతలు ఏర్పడినా అధికారులు స్పందించడం లేదని మండిపడుతున్నారు. పలు ప్రాంతాల్లో రోడ్లు గుంతలతో ప్రమాదకరంగా మారుతున్నాయని, దీంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని చెబుతున్నారు. నగరంలో చాలా చోట్ల రోడ్లు గుంతలతోనే దర్శనమిస్తున్నాయని, వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహనదారులు, ప్రజలు పేర్కొంటున్నారు.

Next Story