నెలరోజుల్లో భూమి అంతమవ్వనుందా ? నాసా ఏం చెప్తోంది ?

By రాణి  Published on  20 March 2020 1:19 PM IST
నెలరోజుల్లో భూమి అంతమవ్వనుందా ? నాసా ఏం చెప్తోంది ?

సరిగ్గా నెలరోజుల్లో అంటే ఏప్రిల్ 19,2020 కి భూ గ్రహం అంతమవ్వనుందంటూ ఇంటర్నెట్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందుకు కారణం కూడా ఉంది. ఓ భారీ గ్రహ శకలం ఏప్రిల్ 19వ తేదీన భూమికి అతిసమీపంగా వెళ్లనుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మూడేళ్ల క్రితమే వెల్లడించింది. అయితే ఇప్పుడు ఈ గ్రహ శకలం వల్ల భూ గ్రహం అంతమవ్వనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇందులో నిజమెంతో..అబద్ధమెంతో తెలియక చాలామంది సందేహాలతో కొట్టుమిట్టాడుతున్నారు. అమ్మో..! నిజంగానే భూ గ్రహం అంతమైపోతుందా అని భయపడుతున్నారు.

Also Read : భద్రం..బీ కేర్ ఫుల్ బ్రదరూ..!

నిజానికి 2 వేల అడుగుల పరిణామం ఉండే ఈ గ్రహశకలం భూమికి అతి సమీపంగా వెళ్తుందే తప్ప..భూమిని తాకే అవకాశం లేదని అమెరికాలోని ఓ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే జేఓ 25 గ్రహ శకలం చంద్రుడికి, భూమికి మధ్యనున్న దూరానికి 4.6 రెట్లు దూరంలో పయనించనుందట. ఇంతకుముందు ఇలాంటి గ్రహశకలాలెన్నో భూమికి అతి సమీపంగా వెళ్లాయి. కానీ..గడిచిన 400 ఏళ్లలో, రానున్న 500 ఏళ్లలో భూమికి అతి సమీపంగా వెళ్లే గ్రహశకలం ఇదొక్కటేనని నాసా చెప్తోంది. 2004 సెప్టెంబర్ లో 5 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి టౌటాటిస్ అనే గ్రహశకలం భూమి నుంచి 4 లూనార్లు (ఒక లూనార్ = చంద్రుడి నుంచి భూమికున్నంత దూరం) దూరంలో వెళ్లింది. రాబోయే గ్రహ శకలం దీని కన్నా పెద్దది కావడంతో..దీని వల్ల భూ గ్రహం అంతమవుతుందన్న ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ ప్రచారంలో వాస్తవం లేదు. ఈ గ్రహ శకలం భూమికి దగ్గరగా వెళ్తుంది తప్ప..భూ గ్రహానికి ఎలాంటి హాని తలపెట్టదని నాసా కూడా స్పష్టం చేసింది. ఏప్రిల్ 19 తర్వాత భూమి నుంచి దూరంగా వెళ్లే క్రమంలో రాత్రి సమయంలో టెలిస్కోపు ద్వారా ఈ గ్రహ శకలాన్ని చూడవచ్చని పేర్కొంది.

Also Read : భారత్‌లో ఐదో కరోనా మరణం

Next Story