బిగ్‌ట్విస్ట్‌.. డబుల్‌ ఎలిమినేషన్‌లో హారిక.. అయితే..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Sept 2020 5:15 PM IST
బిగ్‌ట్విస్ట్‌.. డబుల్‌ ఎలిమినేషన్‌లో హారిక.. అయితే..!

తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్‌. ఇటీవలే సీజన్‌ 4 ప్రారంభమైంది. మొదట్లో కంటెస్టెంట్ల విషయంలో నిరాశ పరిచిన బిగ్ బాస్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీలు, గంగవ్వ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. గతవారం దర్శకుడు సూర్యకిరణ్‌ ఎలిమినేట్‌ అయ్యారు. శనివారం.. త‌న‌మాటే క‌రెక్ట్ అంటూ చీటికిమాటికీ గొడ‌వ‌లు ప‌డి అప్ర‌తిష్ట మూట గ‌ట్టుకున్న క‌‌రాటే క‌ల్యాణిని బిగ్‌బాస్ హౌస్ నుంచి బ‌య‌ట‌కు పంపించేశారు. కాగా.. డబుల్‌ ఎలిమినేషన్‌ అంటూ చివర్లో ట్విస్ట్‌ ఇచ్చారు నాగార్జున. నేడు ఆదివారం ఇంకో ఎలిమినేషన్‌ జరగనుంది.

అయితే.. ఇది ఫేక్‌ ఎలిమినేషన్‌ అని వార్తలు వినిపిస్తున్నాయి. దేత్తడి హారికను ఎలిమినేట్‌ చేసి.. ఆమెను సీక్రెట్ రూమ్ కు పంపిస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. గతంలో రాహుల్ సిప్లిగంజ్ ను కూడా ఇదే తరహాలో ఫేక్ ఎలిమినేషన్ పేరిట కొన్నిరోజుల పాటు హౌస్ కు దూరంగా ఉంచారు. ఈసారి దేత్తడి హారిక అంశంలో సేమ్ ప్లాన్ అమలు చేయాలని బిగ్ బాస్ ఆలోచిస్తున్నాడట. మరీ ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్‌ ఎండింగ్‌ వరకు వెయిట్‌ చేయకతప్పదు.

ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమోలో నిన్న ఎలిమినేట్ అయిన క‌ల్యాణితో పాటు, అటు ఇంటి స‌భ్యులంద‌రితోనూ నాగ్ గేమ్స్ ఆడించారు. అవినాష్‌ను క‌ల్యాణి అమాయ‌క చ‌క్ర‌వ‌ర్తి అని చెబుతుంది. అంతేకాకుండా అతడు ఇంట్లో బలి అవుతాడని జాలి చూపిస్తుంది. దీంతో అవినాష్ 'నాక‌న్నా ముందు నువ్వే బ‌ల‌య్యావుగా అక్కా' అంటూ ఉన్న‌మాట బ‌య‌ట‌పెట్టాడు. దేవి నాగ‌వ‌ల్లిని తక్కువ అంచనా వేయ‌వద్దని కళ్యాణి సూచించింది. త‌ర్వాత క‌ల్యాణి బిగ్‌బాంబ్‌ను వేసింది. ఆ బిగ్ బాంగ్‌ ఏంటి..? ఎవరిపై వేసింది తెలియాలంటే మరి కొద్ది గంటలు ఆగక తప్పదు.

Next Story