సీఎం జగన్ గారూ పెద్ద కుట్ర జరుగుతోందంటూ హీరో రామ్ సంచలన ట్వీట్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Aug 2020 9:41 AM GMT
సీఎం జగన్ గారూ పెద్ద కుట్ర జరుగుతోందంటూ హీరో రామ్ సంచలన ట్వీట్

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని అప్పుడప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్లలో సినిమాలకు సంబంధించిన విషయాలే కాకుండా రాజకీయాలకు సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తూ ఉంటారు. అలాగని రామ్ ఏ రాజకీయ పార్టీకి కూడా మద్దతుగా మాట్లాడడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ సంచలన ట్వీట్ చేశారు. జగన్ మోహన్ రెడ్డికి తెలీకుండా ఆయన వెనుక ఉన్న వాళ్లు ఏదో చేస్తున్నారని చెప్పుకొచ్చారు హీరో రామ్.

"సీఎంను తప్పుగా చూపించడానికి పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది. వైఎస్ జగన్ గారూ, మీ కింద పనిచేసే కొంతమంది మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల మీ ప్రతిష్ఠకు, మేం మీమీద పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ కలుగుతోంది. అలాంటి వాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నాం" అంటూ రామ్ ట్విట్టర్ లో స్పందించారు. "ఏపీ గమనిస్తోంది" అంటూ హ్యాష్ టాగ్ కూడా పెట్టారు.

'హోటల్ స్వర్ణ ప్యాలస్ ని రమేష్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్ గా మార్చక ముందు , ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది. అప్పుడీ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు ?' అని ప్రశ్నించారు రామ్.



ఫైర్ + ఫీజు ‌= ఫూల్స్

అంద‌రినీ ఫూల్స్ చేయ‌డానికే విష‌యాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మ‌ళ్లిస్తున్నారా?

ఫీజుల‌ వివ‌ర‌ణ ‌: మేనేజ్‌మెంట్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్న స్వ‌ర్ణ‌ప్యాలెస్‌ డైరెక్ట్ గా బిల్లింగ్ చేసింది. అంటూ మరో ట్వీట్ లో ఫీజులకు సంబంధించిన ఫోటోలను పోస్టు చేశారు.



Next Story