బిగ్ బాస్ 4 లో కనిపించనున్న కంటెస్టెంట్లు వీళ్లేనా ? హోస్ట్ ఎవరో.?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 May 2020 11:08 AM ISTబిగ్ బాస్..విరామం లేకుండా వరుసగా మూడేళ్లు మూడు సీజన్లు పూర్తి చేసుకున్న రియాలిటీ షో ఇది. తొలుత బాలీవుడ్ లో మొదలైన ఈ రియాలిటీ షో తర్వాత తమిళంలో, తెలుగులో కూడా మొదలైంది. బాలీవుడ్ బిగ్ బాస్ సీజన్లకు సల్మాన్ ఖాన్ మాత్రమే హోస్ట్ చేస్తుండగా..తెలుగులో మాత్రం సీజన్ కు ఒక హోస్ట్ తెరపై కనిపిస్తున్నారు. ఫస్ట్ సీజన్ కు టాలీవుడ్ యంగ్ టైగర్ తనలో ఉన్న యాంకరింగ్ స్కిల్స్ ను బిగ్ బాస్ వేదికగా బయటపెట్టారు. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ కు ఊహించని రేటింగ్ రావడంతో..రెండో సీజన్ ను ఎలాంటి అనుమానాలు లేకుండా మొదలుపెట్టారు. కానీ రెండోసీజన్ కు ఎన్టీఆర్ డేట్స్ దొరకక పోవడంతో హీరో నాని ని హోస్ట్ గా తీసుకుంది బిగ్ బాస్ యాజమాన్యం. తొలుత నాని యాంకర్ గా కొంచెం తడబడినప్పటికీ ఆ తర్వాత కాస్త ఫర్వాలేదనిపించింది.
ఇక మూడో సీజన్ కు కింగ్ నాగార్జున హోస్ట్ చేశారు. నాగ్ సారథ్యంలో బిగ్ బాస్ 3 సైన్యం హౌస్ లో తెగ అల్లరి చేసింది. బుల్లితెర రాములమ్మ శ్రీముఖి వర్కవుట్స్, రాహుల్ - పున్ను అలకలు, బుజ్జగింపులు, బాబా మాస్టర్ ఫన్నీ స్టెప్స్, స్క్రిప్ట్స్, వరుణ్ సందేశ్ - వితికల ఆన్ స్క్రీన్ రొమాన్స్ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశాయి. నాల్గవ సీజన్ మొదలు పెడదామనుకునేలోపే అనుకోని కష్టం వచ్చి పడింది. అదేనండి కరోనా.. ఈ మహమ్మారి వైరస్ కారణంగా పెట్టిన లాక్ డౌన్ తో హౌస్ సభ్యుల ఎంపిక, షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. కాగా..బిగ్ బాస్ 4కు హోస్ట్ గా చిరంజీవి లేదా మహేష్ బాబు వ్యవహరిస్తారని చాలా వార్తలొచ్చాయి. వీటిలో నిజమెంతో తెలీదు గానీ..తాజాగా నాల్గవ సీజన్ కు కూడా నాగార్జునే వ్యాఖ్యాతగా ఉంటారన్న విషయం తెరపైకొచ్చింది. అంతేకాదు..హౌస్ లో ఉండే సభ్యుల ఎంపిక కూడా జరిగిపోయిందన్న ప్రచారం జరుగుతుంది.
అల్లరి నరేష్, సింగర్లు హేమచంద్ర, మంగ్లీ, యాంకర్ వర్షిణి, సుధీర్ ఇలా ఐదారుగురి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. అయితే ఇటీవలే ఇన్ స్టా లైవ్ లో తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చిన వర్షిణిని ఓ నెటిజన్ మేడమ్ మీరు బిగ్ బాస్ 4 సీజన్ లో కనిపించనున్నారట నిజమేనా ? అని అడుగగా అవును..కాదు అన్నట్లుగా ఎక్స్ప్రెషన్లు పెట్టింది. బహుశా హౌస్ కు వెళ్లే వారి లిస్ట్ లో వర్షిణి పేరున్నా..ఆ విషయాన్ని ఇప్పుడే అందరికీ చెప్పకూడదనుకుందో ఏమో.
జూలైలో షూటింగ్..అక్టోబర్ లో టెలీకాస్ట్
ఇటీవలే చిరంజీవి, నాగార్జునలతో పాటు మరో ఇద్దరు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తలసానిలతో సమావేశమై సినిమా షూటింగ్ లు చేసుకునేందుకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరిన సంగతి తెలిసిందే. ఇందుకు కేసీఆర్ సార్ కూడా అంగీకారం తెలుపుతూ మూడు దశల వారిగా షూటింగులకు అనుమతులిస్తామని హామీ ఇచ్చారు. దీంతో జూలై ఆఖరి వారం నుంచి బిగ్ బాస్ 4 సీజన్ షూటింగ్ మొదలవ్వనున్నట్లు సమాచారం. అనుకున్న దాని ప్రకారం సీజన్ షెడ్యూల్ మొదలైతే అక్టోబర్ లో బిగ్ బాస్ 4 టెలీకాస్ట్ అవ్వనుందనమాట.