'బిచ్చగాడు 2' ఫస్టు లుక్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 July 2020 5:17 PM IST
బిచ్చగాడు 2 ఫస్టు లుక్‌

'బిచ్చగాడు' సినిమాతో తమిళంతో పాటు ఇటు తెలుగులో భారీ విజయం అందుకున్న నటుడు విజయ్‌ ఆంటోని. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఈ చిత్రంలో విజయ్‌ ఆంటోని నటించడంతో పాటు నిర్మాతగా, సంగీత దర్శకుడిగా కూడా వ్యవహించారు. శశి దర్శకత్వంలో తెరకెక్కిన బిచ్చగాడు సినిమా అమ్మ సెంటిమెంట్ని అద్భుతంగా చూపించి సక్సెస్‌ అయ్యారు. ఈ చిత్రం తరువాత విజయ్‌ నటించిన ప్రతి చిత్రం తెలుగులో విడుదలైంది.

తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌ రాబోతుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్ ఆంటోనీ 'బిచ్చగాడు' సీక్వెల్ కథ రెడీ అవుతుందని.. నాలుగు నెలల నుంచి స్క్రిప్ప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నానని వెల్లడించారు. నేడు విజయ్ ఆంటోనీ పుట్టినరోజు. ఈ సందర్భంగా.. 'బిచ్చగాడు 2' అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం.

'బిచ్చగాడు 2' సినిమాకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రియా కృష్ణస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ ఆంటోని హీరోగా నిర్మాతగా వస్తున్న ఈ సినిమా తమిళంలో 'పిచ్చైకారన్ 2' తెలుగులో 'బిచ్చగాడు 2' పేరుతో రూపొందనుంది. ఈ ఏడాది చివర్లో షూటింగ్‌ ప్రారంభించి వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాకాలు చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.



Next Story