బిహెచ్ఈఎల్ ఉద్యోగిని ఆత్మహత్య
By సత్య ప్రియ Published on 18 Oct 2019 5:14 AM GMTతన పై అధికారి తనను వేధిస్తున్నారని బీహెచీఎల్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది.
బిహెచ్ఈఎల్ లో పనిచేస్తున్న 33 ఏళ్ల నేహా అకౌంట్స్ ఆఫీసర్ గా పని చేస్తోంది. బిహెచ్ఈఎల్ కాలనీలోని తన ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరేసుకుంది. రాజస్థాన్ కు చెందిన నేహా ఆరు నెలల క్రితమే బదిలీపై నగరానికి వచ్చింది.
తన పై అధికారి డీజీఎం కిషోర్, కొందరు సహోద్యోగుల మానసిక వేధింపుల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లో రాసింది. తన కుటుంబ సభ్యులు లేని సమయంలో ఆమె ఈ పని చేసింది.
బిహెచ్ ఈఎల్ డిజిఎం పై కేసు నమోదు చేసారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story