2లక్షలకే మెర్సిడెస్‌ బెంజ్‌.. రూ.78వేలుగూగుల్‌ పే.. ఆతరువాత

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 July 2020 2:24 PM GMT
2లక్షలకే మెర్సిడెస్‌ బెంజ్‌.. రూ.78వేలుగూగుల్‌ పే.. ఆతరువాత

లగ్జరీ కార్లలో తిరగాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. తక్కువకే లగ్జరీ కారు సొంతం చేసుకోవచ్చు ఆశ చూపించి అందిన కాడికి దోచుకున్నాడో జాదూగాడు. సెకండ్‌ హ్యాండ్‌లో మంచి కండిషన్‌లో ఉన్న లగ్జరీ కారును కేవలం రూ.2లక్షలకు ఇప్పిస్తానని చెప్పాడు. కొంత అడ్వాన్స్‌ చెల్లించాలన్నాడు. ఇది నిజమేనని నమ్మిన ఓ వ్యక్తి పెద్ద మొత్తంలో ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. ఇంకేముందుంది ఫోన్‌ స్విచ్చాప్‌ చేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు పిర్యాదు చేశాడు. ఈ ఘటన బెంగళూరు నగరంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ఖలీల్‌ షరీప్‌ తక్కువ బడ్జెట్‌లో మంచి లగ్జరీకారును కొనుక్కోవాలనుకున్నాడు. జీవన్‌ భీమానగర్‌లోని గ్యారేజీ, సర్వీస్‌ స్టేషన్‌కు తరచూ వెలుతుండేవాడు. అక్కడ ఆ గ్యారేజ్‌ ఓనర్‌ బంధువు పరిచయం అయ్యాడు. అతడి పేరు దస్తగిరి పరిచేసుకున్న అతను.. తన దగ్గర 2006 మోడల్‌ మెర్సిడెస్‌ బెంజ్‌ కారు ఉందని.. రూ.2.25లక్షలు ఇస్తానని చెప్పాడు. కాగా.. ఖలీల్‌ బేరమాడడంతో.. రూ.2లక్షలకు బేరం కుదిరింది. అందులో భాగంగా కొంత అడ్వాన్స్‌ ఇవ్వాలని అడిగాడు. మార్చి 11న ఖలీల్‌ రూ.78వేలను గూగల్‌ పే ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. రెండు రోజుల్లో కారు వస్తుందని దస్తగిరి చెప్పాడు.

రెండు రోజుల్లో కారు తెస్తానని చెప్పిన దస్తగిరి.. మూడు నెలలు అయిన సరే కారు తీసుకురాలేదు. ఎన్ని రోజులు అయిన కారు తీసుకురాకపోవడంతో దస్తగిరికి ఫోన్‌ చేశాడు. ఎన్ని సార్లు చేసిన స్విచాఫ్‌ రావడంతో.. మోసపోయానని గ్రహించి పోలీసులకు పిర్యాదు చేశాడు ఖలీల్‌ షరీప్. అయితే.. అక్కడ అసలు విషయం తెలిసింది. దస్తగిరి ఇలా మోసాలు చేయడం కొత్త కాదని.. అతనిపై అప్పటికే 30 పిర్యాదులు ఉన్నాయని తెలిసి షాకయ్యాడు.

Next Story
Share it