భారీ అగ్ని ప్రమాదం.. ఘటన స్థలానికి 35 ఫైరింజన్లు

By సుభాష్  Published on  9 July 2020 8:20 AM GMT
భారీ అగ్ని ప్రమాదం.. ఘటన స్థలానికి 35 ఫైరింజన్లు

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒకవైపు ఢిల్లీలో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో వ్యాపిస్తుంటే మరో వైపు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిత్యం ఎక్కడో ఓ చోట అగ్ని ప్రమాదం సంభవిస్తూ భారీగా ఆస్తి నష్టం జరుగుతోంది. తాజాగా ముంద్కా ప్రాంతంలోని ఓ గోదాంలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దట్టమైన పొగలు కమ్ముకుని పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. అయితే గోదాంలో స్టోర చేసిన ఎలక్ట్రానిక్‌ వస్తువులు, వైద్య పరికరాలు పూర్తిగా కాలిబూడిదైనట్లు సమాచారం.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి 35 ఫైరింజన్లతో చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఏదైనా షాట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం సంభవించి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. షాట్‌ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగిందా..? లేక ఇంకేమైనా కారణం ఉందా.. అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. ప్రమాదంలో భారీ ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది.

Next Story
Share it