అనంతపురంలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

By సుభాష్  Published on  9 July 2020 4:23 AM GMT
అనంతపురంలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

ఏపీలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంపురం జిల్లాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరు నుంచి అనంతపురం వస్తున్నకారు రాప్తాడు మండలంలోని 44వ జాతీయ రహదారిపై గొల్లపల్లి వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వ్యక్తికి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన వారు బుక్కరాయసముద్రం మండలం సిద్దరాంపురం గ్రామానికి చెందిన చిన్నమ్మ (65), అమర్‌నాథ్‌ ( 40), రాజు (28)గా గుర్తించారు. కేసున నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాగా, దేశంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, అతివేగం, మద్యం తాగి నడపడం వంటి కారణాలతో ప్రమాదాలు చోటు చేసుకుని అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దేశంలో కరోనా ఉన్నందున ఇటీవల రెండు నెలల పాటు లాక్‌డౌన్‌ ఉండగా, ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగలేదు. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత ఎన్నో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగి ఎందరో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

Next Story