వనపర్తి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూతగాదాల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఓ మహిళపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశారు. ఈ ఘటన వనపర్తి జిల్లా బుద్దారంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బుద్ధారం గ్రామానికి చెందిన అనంతరావు, అర్జునయ్యా ఇద్దరు దూరపు బంధువులు. వీరికి బుద్దారం శివారులో గల ఏడు ఎకరాల భూమికి సంబంధించి రెండు సంవత్సరాలుగా తగాదా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత రెండు రోజుల క్రితం ఇద్దరు కలిసి భూమికి సంబంధించిన వ్యవహారం పై కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అనంతరావు అర్జునయ్యకు ఏడు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాడు.

అనంతరావు ఇస్తానన్న డబ్బులకోసం ఈ రోజు ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో అర్జునయ్య అతని కొడుకు అనంతరావు ఇంటికి వెళ్లి డబ్బుల గురించి అడిగాడు. దీంతో మాటా మాటా పెరగడంతో అనంతరావు అర్జునయ్యను కొట్టాడు. దీంతో కోపానికి గురైన అర్జునయ్య ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని అనంతరావు పైకి వెళ్లడంతో అక్కడే ఉన్న అనంతరావు భార్య రత్నమ్మ(55) అడ్డు వెళ్ళింది. దీంతో అర్జునయ్య మరింత కోపంతో ఊగిపోతూ అనంతరావు భార్య రత్నమ్మ పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని చేరుకుని రత్నమ్మ ను అంబులెన్స్ లో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ అపూర్వరావు బుద్ధారం గ్రామానికి చేరుకొని పూర్తి విచారణ చేపట్టారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.