అమ్మాయిలు నడుచుకుంటూ వెళుతుంటే వచ్చిన ఎలుగుబంటి.. తర్వాత ఏమైందంటే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 July 2020 2:25 PM GMT
అమ్మాయిలు నడుచుకుంటూ వెళుతుంటే వచ్చిన ఎలుగుబంటి.. తర్వాత ఏమైందంటే..!

అమ్మాయిలు అలా నడుచుకుంటూ వెళుతున్నారు.. వెనకా.. ముందు మరికొందరు కూడా ఉన్నారు. ఇంతలో ఓ నలుపు రంగు ఎలుగుబంటి అక్కడికి వచ్చింది. ఇద్దరు అమ్మాయిలకు దగ్గరగా వచ్చింది. వెనుక కాళ్ల మీద నిలబడి వాసన చూస్తూ ఉండిపోయింది. ఇలాంటి ఘటనలు ఒళ్లు గగుర్పాటుకు గురిచేసేవే..! ఈ ఘటన మెక్సికో లోని చిపిన్క్యూ ఎకలాజికల్ పార్క్ లో చోటుచేసుకుందని డెయిలీ మెయిల్ తెలిపింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. సదరు మహిళలు నడుచుకుంటూ వెళుతుండగా.. నలుపు ఎలుగుబంటి అక్కడికి వచ్చేసింది. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళంతా ఊపిరి బిగబట్టి ఆ మహిళను ఏమి చేస్తుందో అని చూస్తూ ఉన్నారు. ఇంతలో ఆ ఎలుగుబంటి తన వెనక కాళ్ళను ఎత్తి ఆ మహిళను వాసన చూడడం మొదలుపెట్టింది. కొద్దిసేపు అలా వాసన చూసిన ఎలుగుబంటి పెద్దగా ఆసక్తి చూపించలేదు. అదే సమయంలో ఆ మహిళ కూడా ఫోటోను తీసుకుంది. కొద్దిసేపటికి అక్కడి నుండి ఆ ఎలుగుబంటి వెళ్ళిపోయింది.

ఈ వీడియోను ప్రముఖ ఎన్.బి.ఏ. ఆటగాడు రెక్స్ చాప్ మన్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. మరికొందరు కూడా ఈ వీడియోను వివిధ యాంగిల్స్ లో తీశారు. మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. ఆ ఎలుగుబంటి ట్రైనింగ్ తీసుకున్నది.. ఎవరికీ హాని చేయనిది అని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. మరికొందరు మాత్రం ఇలాంటి ఘటనలు ఎంతో భయానికి గురిచేస్తుంటాయని అన్నారు.

చిపిన్క్యూ ఎకలాజికల్ పార్క్ లో నలుపు రంగు ఎలుగుబంట్లు కనిపించడం అరుదైన విషయం కాదని స్థానికులు చెబుతున్నారు. గత ఏడాది నవంబర్ లో ఓ మహిళను వెంబడించిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. బ్రౌన్ రంగు ఎలుగుబంట్లతో పోలిస్తే.. నలుపు రంగు ఎలుగుబంట్లు పెద్ద ప్రమాదకారి కావని చెబుతున్నారు నిపుణులు. మనుషులకు చాలా దగ్గరగా నలుపు రంగు ఎలుగుబంట్లు నివసిస్తూ ఉంటాయని.. మనుషుల మీద దాడి చేయడం చాలా అరుదు అరుదని అంటున్నారు.

Next Story