ప్రజల కోసం కలను పక్కన పెట్టిన బాషా ముఖర్జీ..

By Newsmeter.Network  Published on  8 April 2020 7:05 AM GMT
ప్రజల కోసం కలను పక్కన పెట్టిన బాషా ముఖర్జీ..

వృత్తి రీత్యా ఆమె వైద్యురాలు..జీవిత లక్ష్యం ప్రపంచ సుందరి కిరీటాన్ని పొందడం. గతేడాది జరిగిన మిస్ ఇంగ్లండ్ పోటీల్లో..ఆమె విజేత. అంతే ఉత్సాహంతో ప్రయత్నిస్తే ఆమె ఖచ్చితంగా ప్రపంచసుందరి కిరీటాన్ని పొందేదేమో.. కానీ ప్రపంచ సుందరి కిరీటం కన్నా ప్రజల ప్రాణాలు కాపాడటం ముఖ్యమనుకుంది. తన చదువును సార్థకం చేయాలని భావించింది. కరోనా సృష్టిస్తోన్న కల్లోలాన్ని ఆమె మనసు తట్టుకోలేకపోయింది. తన కలని వదిలి..ప్రజల జీవితాలను కాపాడటానికి స్టెత్ స్కోప్ పట్టుకుంది. ఆమే ఇంగ్లండ్ డాక్టర్ బాషా ముఖర్జీ..

Also Read :ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ చేసేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

భారత సంతతికి చెందిన బాషా ముఖర్జీ కుటుంబం ఆమె 9 ఏళ్ల వయసు వరకూ పశ్చిమ బెంగాల్ లోనే ఉన్నారు. ఆ తర్వాత బ్రిటన్ కు షిఫ్ట్ అయ్యారు. చిన్నతనం నుంచి సేవాగుణం కలిగిన బాషా ముఖర్జీ 17 ఏళ్ల ప్రాయంలోనే ‘ద జనరేషన్‌ బ్రిడ్జి ప్రాజెక్ట్‌’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి వృద్ధులు, యువతను కలిపే కార్యక్రమాలను నిర్వహిస్తోంది. బ్రిటన్ లోనే నాటింగ్ హామ్ విశ్వ విద్యాలయంలో మెడిసిన్ పూర్తి చేసింది. స్థానికంగా ఉన్న ఎన్జీఓలతో కలిసి బాలికలకు విద్య, నెలసరి తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు సదస్సులు పెడుతోంది. ఆఫ్రికా దేశాలతో పాటు ఇండియా, టర్కీ, పాకిస్థాన్ వంటి దేశాల్లో పర్యటించి అవగాహన సదస్సులను చేపట్టింది. అలాగే షుగర్ వ్యాధిని నిర్మూలించేందుకు బ్రిటన్ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో సైతం బాషా భాగస్వామ్యురాలైంది. వీటన్నింటితో పాటే తన ప్రపంచ సుందరి కావాలన్న తన కలను సాకారం చేసుకునే దిశగా ప్రయత్నిస్తూనే ఉంది.

Also Read :డబ్ల్యూహెచ్‌వో మమ్మల్ని మోసంచేసింది.. నిధులు నిలిపివేస్తాం – ట్రంప్‌

సౌందర్యం ఏ మాత్రం చెరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకుంది. కరాటే వంటి విద్యలు నేర్చుకుంది. మొత్తంగా ప్రపంచ సుందరి అయ్యేందుకు ఏమేమి అర్హతలుండాలో అవన్నీ బాషా ముఖర్జీ కి ఉన్నాయి. ప్రపంచం లో జరుగుతున్నవిషయాలపై ఆసక్తి కనబరిచేది. గతేడాది ఇంగ్లండ్ లో జరిగిన మిస్ ఇంగ్లండ్ పోటీల్లే విజేతగా నిలిచింది. మిస్ వరల్డ్ పోటీలకు ఇంకా ఒక్క అడుగే దూరం..ఇంతలోనే వచ్చిన రాకాసి కరోనా ఆమె మనసును కలచివేసింది.

Also Read :కరోనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు ప్రభుత్వం దృష్టి

కరోనా వైరస్ తో ఇంగ్లండ్ తో పాటు ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. పిలిగ్రాం లోని ఓ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ గా పనిచేస్తున్న బాషా ఇలాంటి సమయంలో ఒక డాక్టర్గా తన సేవలు ప్రజలకు ఎంతో ముఖ్యమని గ్రహించింది. అంతే.. తన కలను పక్కనపెట్టి స్టెత్ స్కోప్ పట్టుకుని కరోనా బాధితుల కోసం కదిలింది. ఇప్పుడు తన మనసులో మాటలను బయటపెట్టింది. మిస్ ఇంగ్లండ్ అనే పేరు కన్నా ఇప్పుడు డాక్టర్ బాషా ముఖర్జీ అనే పేరునే ఇష్టపడుతున్నానని పేర్కొంది. భారత సంతతికి చెందిన అమ్మాయినే అయినప్పటికీ ఇంగ్లండ్ వాసులు తనను ఎంతగానో ప్రేమించారని, వారి మనసులో తనకు ఉన్నతమైన చోటునిచ్చారని చెప్పుకొచ్చింది. గతేడాది తనను మిస్ ఇంగ్లండ్ గా ఆదరించిన వారే ఇప్పుడు కరోనా బారిన పడి కష్టాల్లో ఉన్నారని, ఇలాంటి సమయంలో తాను వారికి వైద్య సేవలందించడం తన బాధ్యతగా గుర్తించానని తెలిపారు డాక్టర్ బాషా ముఖర్జీ.

Next Story