ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ చేసేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

By Newsmeter.Network  Published on  8 April 2020 5:59 AM GMT
ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ చేసేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

పెను తుఫాను వచ్చినా అది సృష్టించే విధ్వంసం మూడు, నాలుగు రోజులే ఉంటుంది. కానీ కరోనా రక్కసి చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు కరోనాకు బానిసలయ్యారు. రాజుకు బానిసలు ఆయన మాటకు భయపడి చెప్పినట్లు పడి ఉండేవారు. కంటికి కనిపించని కరోనా కి బానిసలైన మనం..దానికి భయపడి ఇళ్లకే పరిమితమై బానిసలయ్యాం. కరోనా కారణంగా ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. భారత్ లో కూడా లాక్ డౌన్ వల్ల వేల కోట్ల నష్టం వాటిల్లింది. అయినా ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా..ఇంకా లాక్ డౌన్ ను కొనసాగించే యోచనలో ఉంది ప్రభుత్వం. మరోవైపు కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి రోజూ సూచనలిస్తూనే ఉంది.

Also Read :కరోనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు ప్రభుత్వం దృష్టి

కాగా..లాక్ డౌన్ కారణంగా చాలా మందికి నిత్యావసరాలు దొరకట్లేదు. బ్యాచిలర్స్, హాస్టళ్లలో ఉండేవాళ్లు స్విగ్గీ, జొమాటోలలో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ రెండు ఫుడ్ డెలివరీ యాప్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాగా..రెస్టారెంట్లకు వెళ్లి తినేందుకు ఆస్కారం లేదు సరే..మరి ఫుడ్ ను డెలివరీ చేసేటపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలుసా ? కరోనా వైరస్ అనేది వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సంక్రమిస్తుందని తెలిసిందే. ఆర్డర్ చేసిన ఫుడ్ ను తీసుకొచ్చే డెలివరీ బాయ్ ద్వారా కూడా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది. చాలా మంది ఇలా ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో విఫలమవుతున్నారు. ఫుడ్ ఆర్డర్ తీసుకోగానే చేతులు శుభ్రంగా కడుక్కోవట్లేదు. కాంటాక్ట్ డెలివరీ కాకుండా ఫుడ్ తీసుకొచ్చిన వ్యక్తి మీ ఇంటి ముందు పెట్టి వెళ్లినా సరే..అదే ప్యాకెట్ ను మీరు ముట్టుకుంటారు కాబట్టి తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలి. అలాగే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టినపుడు క్యాష్ ఇచ్చేకన్నా..ఫోన్ పే, గూగుల్ పే ల ద్వారా డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యమివ్వాలి.

Also Read :డబ్ల్యూహెచ్‌వో మమ్మల్ని మోసంచేసింది.. నిధులు నిలిపివేస్తాం – ట్రంప్‌

వాస్తవానికి ఫుడ్ డెలివరీ చేసే వారు కూడా ఆయా సంస్థలు సూచించిన జాగ్రత్తలను పాటిస్తున్నారు. ఎక్కువగా కాంటాక్ట్ లెస్ డెలివరీ విధానాన్నే పాటిస్తున్నారు. కానీ మనం కూడా కనీస జాగ్రత్తలను పాటించాలి కగా.. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతీఫుడ్ డెలివరీ ఛానెల్స్ కాంటాక్ట్-లెస్ డెలివరీ విధానాన్ని ప్రస్తుతం అనుసరిస్తున్నాయి. అంటే డెలివరీ సిబ్బంది తమ వినియోగదారులకు ఫుడ్ ప్యాకేజ్‌లను నేరుగా వారి చేతికి అందించకుండా వారి ఇంటి బయటే ఉంచి వెళతారు. మరోవైపు వినియోగదారులు గ్లౌజులు ధరించి తమ ఇంటివద్ద ఉంచిన ఫుడ్ ప్యాకేజ్‌ని తీసుకుంటారు. ఫుడ్ ప్యాకేజీని తెరవడానికి ముందు శుభ్రపరచాలి. ఏదైనా ప్రామాణిక క్రిమిసంహారక మందులను ఉపయోగించి ప్యాకేజ్ ఉపరితలాలను శుభ్రపరిచేటప్పుడు దానిలోని పదార్థాన్ని సురక్షితమైన పాత్రలలోకి మార్చాలి. మీకు అంతగా ఉపయోగపడని అదనపు ప్యాకేజీలను డస్ట్ బిన్ లో వేసేయండి. ఫుడ్ ప్యాకేజ్‌ను తాకిన తరువాత మీ చేతులను 20 సెకన్ల పాటు తప్పనిసరిగా కడుక్కోవాలి. మీరు భోజనం తినడానికి ముందు మైక్రోవేవ్లో 1-2 నిమిషాలు వేడిచేయడం అస్సలు మర్చిపోవద్దు. ఒకవేళ మైక్రో వేవ్ లేకపోతే ప్రెషర్ కుక్కర్ లో వేడి చేసుకుని భోజనం తినడం మంచిది.

Next Story