అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం.. అదే మా అమ్మ ఆకాంక్ష
By అంజి Published on 15 Feb 2020 2:17 PM IST
హైదరాబాద్: ప్రపంచ చైల్డ్‌హుడ్ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా బంజరాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో అవగహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, సినిమా హీరోయిన్ రష్మిక మందాన, క్యాన్సర్ జయించిన చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీడియాట్రిక్ క్యాన్సర్ ఫండ్‌ను ప్రారంభించారు. పిల్లలకు క్యాన్సర్ వైద్యం కోసం ఆస్పత్రి వైద్యులు ఒక రోజు శాలరీని డొనేట్ చేశారు.
దేశానికి బలం యువతేనని, వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బాలకృష్ణ అన్నారు. బసవతారకం ఆస్పత్రి వైద్యులను ఆయన ప్రశంసించారు. చిన్నారులు క్యాన్సర్ వ్యాధి బారినపడటం బాధకరమని, మందు, సిగరెట్ల వలన వచ్చే క్యాన్సర్ ప్రమాదకరమన్నారు. క్యానర్స్ వైద్యం అందరికీ తక్కువ ఖర్చుతోనే అందాలని మా అమ్మ ఆకాంక్ష అంటూ బాలకృష్ణ వ్యాఖ్యనించారు. కాగా నో ఫ్రాఫిట్.. నో లాస్‌లో బసవతారకం ఆస్పత్రిని రన్ చేస్తున్నట్లు బాలకృష్ణ తెలిపారు.
పిల్లలకు క్యాన్సర్ మీద అవగాహన ఉండదని నటి రష్మిక మందాన అన్నారు. ఈ విషయంలో పెద్దలు బాధ్యతగా వ్యహరించాలని రష్మిక పేర్కొన్నారు. తమ కుటుంబంలో కూడా క్యాన్సర్ బాధితులు ఉన్నారన్నారు. క్యాన్సర్ జయించిన చిన్నారులను చూస్తుంటే.. సంతోషంతో కన్నీళ్లు వస్తున్నాయని రశ్మిక అన్నారు. ఈ సందర్భంగా బసవతారకం వైద్యులకు రష్మిక అభినందనలు తెలిపారు.