ఈ నెలలో 14 రోజులు బ్యాంకులకు సెలవులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Oct 2020 12:13 PM IST
ఈ నెలలో 14 రోజులు బ్యాంకులకు సెలవులు

బ్యాంకులో పని ఉన్నవారు తప్పక తెలుసుకోవాలి. ఈ నెలలో బ్యాంకులు 14 రోజులు పనిచేయవు. ఈ సెలవుల్లో రెండు, నాలుగు శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి. రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) తన వైబ్‌సైట్‌లో వెలువరించిన సమాచారం మేరకు.. దసరా, మిలాద్ ఉన్ నబీ, మహాత్మా గాంధీ జయంతి, సర్దార్ పటేల్ జయంతి, చెల్లమ్ తదితర సెలవులు కూడా ఉన్నాయి. దీంతో మొత్తం మీద దాదాపు సగం రోజుల పాటు మాత్రమే బ్యాంకులు తెరచుకుని ఉంటాయి. ఈ నెలలో అక్టోబర్ 4, 11, 18, 25 తేదీలలో ఆదివారాలు. అలాగే అక్టోబర్ 10, 24 తేదీలు రెండో, నాలుగో శనివారాలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో శని, ఆదివారాల్లో నవమి, దసరా (అక్టోబరు 25) పండుగ లొచ్చాయి.

అయితే.. బ్యాంకులకు సెలవులు రాష్ట్రం ప్రాతిపదికన మారుతుంటాయి. కొన్ని రాష్ట్రాల్లో దసరాకు ముందు వచ్చే మహా సప్తమికి కూడా సెలవు వర్తించనుంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో 15 రోజుల సెలవులు రానున్నాయి. ఈ విషయాన్ని గమనించి, సెలవులను చూసుకుని కస్టమర్లు తమతమ లావాదేవీలను పూర్తి చేసుకోవాలని బ్యాంకులు సూచించాయి.

సెలవులు ఏఏ రోజున అంటే..

అక్టోబర్ 2 (శుక్రవారం) - మహాత్మా గాంధీ జయంతి (అన్ని రాష్ట్రాలు)

అక్టోబర్ 8 (గురువారం) - చెల్లం (ప్రాంతీయ)

అక్టోబర్ 23 (శుక్రవారం) - మహాసప్తమి (చాలా రాష్ట్రాలు)

అక్టోబర్ 26 (సోమవారం) - విజయ దశమి (చాలా రాష్ట్రాలు)

అక్టోబర్ 29 (గురువారం) - మిలాద్ ఉన్ నబీ (ప్రాంతీయ)

అక్టోబర్ 31 (శనివారం) - మహర్షి వాల్మీకి, సర్దార్ పటేల్ జయంతి (ప్రాంతీయ)

Next Story