పేలిన గ్యాస్‌పైపు లైన్.. 11 మంది మృతి
By తోట వంశీ కుమార్ Published on 5 Sept 2020 1:17 PM ISTబంగ్లాదేశ్‌లో దారుణం జరిగింది. రాజధాని ఢాకాలో ఓ గ్యాస్ పైపులైన్ పేలింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. ఢాకాలో నారాయణగంజ్‌లోని బైతుస్ సలాత్ జామే మసీదు వద్ద ఉన్న గ్యాస్ పైప్‌లైన్ శుక్రవారం రాత్రి పేలింది. ఈ పేలుడు ధాటికి మసీదులోని ఆరు ఏసీలు కూడా పేలిపోయాయి.
ఈ పేలుళ్లలో 37 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చికిత్స పొందుతూ 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక బాలుడు ఉన్నాడు. మసీదులో ప్రార్థనలు ముగించుకుని బయటకు వస్తుండగా పేలుళ్లు సంభవించాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Next Story