హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. నలుగురు యువకులు మృతి

By సుభాష్  Published on  5 Sep 2020 6:49 AM GMT
హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. నలుగురు యువకులు మృతి

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారు లోయలో పడి నలుగురు యువకులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఖరెగలాలో ఒక బొలెరో వాహనం అదుపు తప్పి లోయలో పడింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అలా దేశంలో ప్రమాదాలు రోజురోజు పెరిగిపోతున్నాయి. అజాగ్రత్త, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అలాగే శనివారం ఉదయం ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న బస్సు చెరీఖడీ సమీపంలో ఒక ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా.. ఫలితం లేకుండా పోతోంది. వీరి కారణంగా ఎందరో అమాయకులు తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.Next Story
Share it