బెంగళూరులో లాక్ డౌన్ అమలు.. ఏవి మూసి ఉంచారు.. ఏవి తెరిచారు..?
By తోట వంశీ కుమార్ Published on 14 July 2020 11:01 AM ISTకర్ణాటక రాజధాని బెంగళూరులో పెరుగుతున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి అధికారులు లాక్ డౌన్ ను అమలుచేయనున్నారు. మంగళవారం రాత్రి నుండి లాక్ డౌన్ ను అమలుచేయడానికి ఇప్పటికే పటిష్ట చర్యలు తీసుకున్నారు అధికారులు. బెంగళూరు నగరం అర్బన్, రూరల్ ప్రాంతాల్లో లాక్ డౌన్ ను అమలు చేయబోతున్నారు. జులై 14, రాత్రి 8 గంటల నుండి జులై 22 ఉదయం 5 గంటల వరకూ లాక్ డౌన్ ను అమలు చేయనున్నారు.
బెంగళూరు నగరంలో లాక్ డౌన్ అమలు చేయనున్న తరుణంలో ఏది ఓపెన్ చేయాలి, ఏది మూసి ఉంచాలి అనే విషయంలో ప్రత్యేకమైన సూచనలను ఇచ్చారు.
విమానాలు, ట్రైన్లు షెడ్యూల్ ప్రకారమే నడుస్తాయి. ప్రజలు ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్స్ కు వెళ్ళడానికి టికెట్స్ పాస్ లాగా పనిచేస్తాయని అధికారులు తెలిపారు. ఇంటర్ స్టేట్, ఇంట్రా స్టేట్ ప్యాసెంజర్ వాహనాలను కేవలం ఎమెర్జెన్సీ సేవల విషయంలో మాత్రమే వెళ్లనిస్తారు. సేవ సింధు పోర్టల్ నుండి అవసరమైన పాస్ తప్పకుండా ఉండాలి.
ఏవి తెరచి ఉంచుతారు:
- పాలు, నిత్యావసరాలు, కూరగాయలు అమ్మే షాపులకు అనుమతి ఇచ్చారు. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకూ మాత్రమే ఈ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
- హోమ్ డెలివరీ అందుబాటులో ఉంటాయి. ప్రజలు బయటకు రావడాన్ని తగ్గించినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
- విధాన సౌధ, వికాస్ సౌధ లోని సెక్రెటేరియట్ ఆఫీసుల్లో 50 శాతం సిబ్బందితో పని జరుగుతుంది.
- సైట్ దగ్గరే పని వాళ్లు ఉంటే.. కంస్ట్రక్షన్ పని చేసుకోవచ్చు.
- ఆసుపత్రులు, మెడికల్ షాపులు తెరచి ఉంటారు.
- పవర్, నీళ్లు, ఎల్.పి.జి. సప్లై వంటివి అందుబాటులోనే ఉండనున్నాయి.
ఏవేవి మూసివేసి ఉంచుతారు:
- పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను లాక్ డౌన్ సమయంలో అందుబాటులో ఉండవు. బస్సులు, మెట్రోలు అందుబాటులో ఉండవు.
- హోటల్స్, రెస్టారెంట్లు కేవలం తీసుకుని వెళ్ళడానికి మాత్రమే.. అక్కడే కూర్చుని తినడానికి అవకాశం లేదు.
- ఎమెర్జెన్సీ సేవలకు సంబంధించిన ప్రభుత్వ ఆఫీసులు మాత్రమే తెరచి ఉంచనున్నారు. వారి ఐడీ కార్డులు పాస్ లుగా వాడుకోవచ్చు.
- స్పోర్ట్స్ కాంప్లెక్స్, జిమ్, స్విమ్మింగ్ పూల్, సినిమా హాళ్లు, మాల్స్, మతపరమైన ప్రదేశాలు మూసి వేయనున్నారు.