ఫస్ట్ టీ20లో భారత్ పై గెలిచిన బంగ్లా..!
By న్యూస్‌మీటర్ తెలుగు
ముఖ్యాంశాలు
- ఫస్ట్ టీ20లో ఓడిన టీమిండియా
- రాణించిన బంగ్లా బేబీలు
- ముస్తఫిజర్ అదిరిపోయే బ్యాటింగ్
ఢిల్లీ: మొదటి టీ20లో టీమిండియాపై బంగ్లా ఏకంగా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమిండియా ఇచ్చిన 149 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముస్తాఫిజర్ 60 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. 43 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో 60 పరుగులు చేశాడు ముస్తఫిజర్. మొదటిలోనే బంగ్లా వికెట్ కోల్పోయింది. సౌమ్య సర్కార్ , మహ్మద్ సయామ్ ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టారు. సౌమ్యా సర్కార్ 39, మహ్మద్ 26పరుగులు చేశారు. చాహల్ వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడదీశాడు.
విజయానికి 18 బంతుల్లో 35 పరుగులు కొట్టాలి. సౌమ్యాను ఖలీల్ బౌల్డ్ చేశాడు. దీంతో భారత్ ఆశలు మళ్లీ చిగురించాయి. 19 ఓవర్లలో ముస్తఫిజర్ ఏకంగా నాలుగు బౌండరీలు బాదాడు. ముస్తఫిజర్ 18 ఓవర్లలో ఇచ్చిన క్యాచ్‌ను కృనాల్ వదిలేయ డంతో టీమిండియా భారీ మూల్యం చెల్లించుకుంది.
ఇక భారత్ ఓపెనర్ శిఖర్ 42 బంతుల్లో 41 పరుగులు చేసి రాణించాడు. రోహిత్ శర్మ కేవలం 9 పరుగులకే అవుటయ్యాడు. వన్ డౌన్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ కూడా 15పరుగులు మాత్రమే చేశాడు. దూకుడు మీదున్న శ్రేయస్ అయ్యర్(22) అమినుల్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. శివమ్ దూబే కూడా జట్టు భారీ స్కోర్ చేయడానికి ఉపకరించలేదు.