టాలీవుడ్‌లో కరోనా కలకలం.. బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Jun 2020 11:18 AM IST
టాలీవుడ్‌లో కరోనా కలకలం.. బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్‌

దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఈ వైరస్‌ బారీన పడుతూనే ఉన్నారు. తాజాగా టాలీవుడ్‌లో కరోనా కలకలం రేపుతోంది. టాలీవుడ్‌ నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇటీవల ఆయన హెయిర్‌ ట్రాన్స్‌ ప్లాంటేషన్‌కు వెళ్లగా.. అనారోగ్య లక్షణాలను చూసిన అక్కడి డాక్టర్‌ కరోనా టెస్ట్‌కు రిఫర్‌ చేశారట. వెంటనే గణేశ్‌ కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో ఆయన క్వారంటైన్‌లోకి వెళ్లారు. హైదరాబాద్‌లో ఓ గేటెడ్ కమ్యూనిటీలో నిర్మాత బండ్ల గణేష్ నివాసం ఉంటున్నారు. ఇప్పుడు ఆయన్ను కలిసిన వారిలో టెన్షన్‌ మొదలైంది. ఇప్పుడు వారందరూ కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు.

కమెడియన్‌గా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన బండ్ల గణేష్‌.. ఆ తరువాత నిర్మాతగా మారారు. పవన్‌ కళ్యాణ్‌తో తీన్‌ మార్‌, గబ్బర్‌ సింగ్ వంటి సినిమాలు నిర్మించాడు. ఆ తరువాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సినిమాలు నిర్మిస్తూనే తండ్రి ద్వారా వచ్చిన పౌల్ట్రీ బిజినెస్‌ను చూసుకుంటున్నారు.'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు.

Next Story