బాలాపూర్: కొలను రామిరెడ్డి రూ.17.67 లక్షలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. మూడేళ్ల నుంచి ప్రయత్నిస్తున్న ఆయన ఈ ఏడాది మాత్రం లడ్డూను వదులుకోడానికి ఇష్టపడలేదు. దీంతో గతేడాది కంటే అదనంగా రూ.లక్ష చెల్లించి బాలాపూర్ లడ్డూ సొంతం చేసుకున్నారు.
లడ్డూ వేలంపాట ను ఎందరో భక్తులు తిలకించారు. విశేషం ఏమిటంటే, ఎందరో భక్తులు నెల్లూరు నుంచి వచ్చి మరీ ఈ వేలం లో పాల్గొన్నారు.
ఇక..భోలక్ పూర్ కు చెందిన బంగారు లడ్డూ రూ. 7.6 లక్షలూ, అమీర్ పేట్ లడ్డూ రూ. 5.4 లక్షలకు భక్తులు దక్కించుకున్నారు